
ప్రకృతి సోయగాల్ని, హృదయపు లాలిత్యాన్ని మేళవించిన పాటలు పరిమళిస్తాయ.
మనసున నిలిచి మధురానుభూతిగా మిగులుతాయి. 'మల్లీశ్వరి' చిత్రంలోని ఈపాట ఈ కోవలోకే వస్తుంది.
మనసున మల్లెల మాలలూగెనె
కన్నుల వెన్నెల డోలలూగెనె
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్నినాళ్ళకి బ్రతుకు పండెనో
కొమ్మలు గువ్వలు గుసగుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలలు కొలనులో గలగలమనినా
దవ్వుల రేణువు సవ్వడు వినినా
నువ్వు వచ్చేవని -నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూసితిని
గడియ ఏని ఇక విడిచి పోకుమా
ఎగసిన హృదయం పగుల నీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయినిండెనో
చిత్రం: మల్లీశ్వరి
రచన: దేవులపల్లి కృష్టశాస్త్రి
గానం: భానుమతి
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
8 comments:
నా "ఆపాతమధురాలు" బ్లాగ్ కోసం ఒక మంచి పాటని గుర్తు చేశారండీ.. థాంక్యూ
భానుమతి గారు పాడిన english song విన్నారా నాగేంద్ర గారు?
"que sera sera..."
థాంక్స్...రాజి గారు!
ఇంగ్లీష్ లో కూడా పాడారా ? వినలేదండి!
రోజూ విన్నా విసుగు రాని పాటల్లో మల్లీశ్వరి సినిమా ఒకటి. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి.
http://www.youtube.com/watch?v=nUSLdY4mL4Q
నా యూనివర్సిటీ చదువుల రోజుల్లో బాలాంత్రపు రజనీ కాంతారావు గారు మాకు విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉండేవారు.నన్ను చూడగానే తరుచుగా ఈ పాటే పాడేవారు.ఆయనకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఇదొకటి అని చెప్పేవారు.అద్భుతమైన పాటని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
మల్లీశ్వరి.
very nice song.. MArapu raani paata. Thank you very much!
Post a Comment