”శోధిని”

Wednesday 11 April 2012

జలసంపద

రాష్ట్రంలో మంచి నీటికోసం సామాన్య ప్రజలు అల్లాడి పోతున్నారు. గొంతు తడుపుకోనేందుకు నీటి బొట్టు కోసం నానా అవస్థలు పడుతున్నారు. నీటి సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.  నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్  చార్జీలు పెంచడంలో వున్నశ్రద్ధ  సామాన్య ప్రజలు త్రాగే మంచి నీటి పైన లేకపోవడం విచారకరం. అధికారుల నిర్లక్ష్యం , కొరబడిన పర్యవేక్షణ కారణంగా మంచినీటి సమస్య ఉత్పన్నమైంది.  కలుషితమైన నీరు త్రాగడం వల్ల ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది.  ఎన్నికల్లో రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు.  పారిశ్రామిక వేత్తలు లెక్కలేనంత నోట్ల కట్టలను దేవుని హుండీలో వేస్త్రారు కాని,ప్రజల అవసరాలు తీర్చే పనులకు ఒక్క పైసా కుడా  ఖర్చు చేయరు.  పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా,ఆయా సంబంధిత శాఖల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వాలను నమ్ముకుంటే రాబోయే తరాల వారికి మంచి నీరు అంటే ఏమిటో తెలియని  పరిస్థితి వస్తుంది.  అందుకే ప్రతి ఒక్కరు తమవంతు భాద్యతగా భూగర్భ జలాలను పెంచడానికి తమ తమ ఇంటి ముందు ఇంకుడు గుంటలు తయారు చేయండి.  వీలయినన్ని చెట్లను పెంచండి.  చెరువులోని వ్యర్ధాలను తొలగించి నీటిని కలుషితం కాకుండా చూడండి.  చెరువులలో కట్టడాలను వ్యతిరేకించండి.  జలసంపద అమూల్యం- కాపాడుకోవడం అనివార్యం.              

3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

అసలు 'వాల్టా" చట్టం గురించి అవగాహన కల్పించడం మరచిపోయారు కదండీ.. ప్రజలు వారికి సాధ్యపడని అవినీతి పై.. యుద్ధం చేయలేరు. కనీసం సహజవనరులను కాపాడుకుంటూ.. త్రాగే నీళ్ళ కోసం అవగాహనతో నడుచుకోవడం సాధ్యమే కదా! మినరల్ ప్లాంట్స్ కి అనుమతి ఇచ్చి వ్యాపారం చేయిస్తుంటే.. వాటర్ రీసోర్సేస్మేంట్ గురించి ఆలోచిస్తారా..చెప్పండి పదేళ్ళు వెనక్కి వెళ్లి నట్టున్నారు మీరు.

కనీసం మీలా కొంతమందికి ఉన్న ఆలోచనతో.. నడవాలనుకోవడం తప్ప ఏం మిగల లేదు.

థాంక్ యు నాగేంద్ర గారు.

వనజ తాతినేని/VanajaTatineni said...

word verification cancel cheyandi plz..

జలతారు వెన్నెల said...

ప్రవీణ గారి బ్లాగ్ లో ఈ video చూడండి!

http://alochanalu.wordpress.com/

post : నేటి పిల్లల ప్రశ్నలు..సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా?