”శోధిని”

Tuesday, 3 January 2012

మంచి మాటలు

1)  మంచివారి దగ్గర అహంభావం చూపొద్దు
     అహంకారులతో వనయంగా ఉండొద్దు.


2)  నువ్వు ఇష్టపడేవాళ్ళను కాదు,
     నిన్ను ఇష్టపడేవాళ్ళను ఇష్టపడు.


3)  ప్రతివిషయాన్ని స్పష్టంగా చూడగలిగేవాడు 'మేధావి'
     ఇతరుల గురించి చెడుగా మాట్లాడేవాడు  చాలా 'ప్రమాదకారి'.


4)  'మంచిపనులు' గంధం కన్నా, మల్లెలకన్న మిన్నగా ఉంటాయి.


5)  'అసూయ' ద్వేషాన్ని రగుల్చుతుంది.  ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.


6)  తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాపడి క్షమించమని అడిగేవారు 
      'గుణవంతులు'.
7)  తాము ఏ తప్పు చేసినా తమదే పైచేయి అని వాదించేవారు 'మూర్ఖులు'.


8)  విజయం సాదించినవారు  పొంగి పోకూడదు
     విజయ రహష్యాలు నలుగురితో పంచుకోవాలి.


9)  ఓడిపోయినవారు కుంగిపోకూడదు
     ఓడిన కారణాలను విశ్లేషించుకోవాలి.


10) చిన్న నిప్పురవ్వ చాలు ఆస్తి బూడిద కావడానికి --
      చిన్న తప్పు చాలు మనిషి జీవితాన్ని మసి చేయడానికి 
                             
                                  * * * * * *



2 comments:

జ్యోతిర్మయి said...

మొదటి దానిలో రెండో వాక్యం వాళ్ళ అహాన్ని ఇంకా రెచ్చగొడుతు౦ దేమో..మనుషులను బట్టి మన స్వభావాన్ని మార్చుకోవడం అవసమంటారా....

కాయల నాగేంద్ర said...

మీ వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నానండి! కానీ, అహంకారుల దగ్గర
వినయంగా ఉంటె వాళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని మరింతగా
అణగతొక్కడానికి ప్రయత్నిస్తారని నా ఉద్దేశం.