”శోధిని”

Thursday 17 November 2011

కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం 'శ్రీ రామరాజ్యం'



ఈ రోజు (17-11-11) విడుదలైన శ్రీ రామరాజ్యం చిత్రం, నేడు వస్తున్న
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంది.  ఈ చిత్రాన్ని చూస్తున్నంత సేపు     
మరో 'లవకుశ' ను చూస్తున్నట్టు ఉంది.  ఇలాంటి దృశ్య కావ్యాలను
శ్రీ బాపు గారే తీస్తారని మరోసారి నిరూపించారు.  శ్రీరాముని గెటప్ లో
బాలకృష్ణ గారి నటన నభూతో నభవిష్యతిగా ఉంది.  శ్రీరాముడి పాత్రకి
జీవం పోశారు. ప్రతి సన్నివేశంలోనూ  తన తండ్రిగారిని గుర్తుకు తెచ్చారు.
శ్రీ నాగేశ్వరరావు గారు, నయనతార, శ్రీకాంత్ లు తమ పాత్రలకు పూర్తి
న్యాయం చేసారు.  ఇప్పుడొస్తున్న సినిమాలలో మన సంప్రదాయాలు
కాగడా పెట్టి వెతికినా కానరావు.  అలాంటి విలువలున్న 'శ్రీ రామరాజ్యం'
చిత్రం రావడం ఆనందదాయకం. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు
ప్రత్యేక ఆకర్షణ. పాటల చిత్రీకరణ బాగుంది.  తెర పైన పాటలన్నీ బాగున్నాయి.
ఈ తరం వారిని ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకున్న 'శ్రీ రామరాజ్యం'
కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం.

2 comments:

Anonymous said...

thanks for sharing...sir..టెన్షన్ గా ఉన్నామ్...జనాలు మంచి చిత్రాలకు ఓటేసే మూడ్ లో ఉన్నారో లేరోనని...

కాయల నాగేంద్ర said...

టెన్షన్ అవసవం లేదు.'శ్రీ రామరాజ్యం' చిత్రాన్ని
అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. మంచి
సినిమాలకు ఎప్పుడూ భవిషత్తు ఉంటుందని ఈ చిత్రం
నిరూపించింది.