మా ఆఫీసులో పనిచేసే వారంతా తెలుగువారే. కాని, తెలుగు మాట్లాడితే తమ హొదాకు భంగమనుకుంటారు. తెలుగు మాట్లాడేవారిని చూసి నవ్వుకుంటారు. తెలుగు పదాలను హేళన చేస్తుంటారు. పరభాషా వ్యామోహంలో పడి మన తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు. తెలుగు భాషలోని తియ్యదనం ఇలాంటివారికి ఎంత చెప్పినా చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లు అవుతుంది. కట్టు, బొట్టు తెలుగువారిదయినప్పుడు తెలుగులో మాట్లాడటం అవమానంగా భావించడం ఎందుకు? గొప్పలకుపోయి మాతృభాషను కించపరచడం ఎందుకు? ఇలాంటివారివల్ల తెలుగు సంస్కృతులు, ఆచారవ్యవహారాలు మాయమైపోతున్నాయి. మధురమైన తెలుగు భాషలోని పలుకులు తేనెలొలికే గులికలని, ప్రతి తెలుగుపదం వీనులవిందుగా, వినసొంపుగా ఉంటాయని మన తెలుగువాళ్ళు తెలుసుకొనే రోజు రావాలి.
6 comments:
Its pity sorry ... sorry కాదు క్షమించండి ఇది మన ప్రారబ్ధం
రాజశేఖర్ దాసరి గారూ మీ స్పందనకు ధన్యవాదాలండి.
మై టెల్గు ఇస్ నా ద గుడ్.(my telugu is not that good)అని చెప్పుకుంటేనే ఎక్కువ గౌరవంట లెండి...
మాట్లాడే వారన్నా స్పష్టంగా మాట్లాడితే బావుణ్ణు. 'తెలుగుదేషెం', 'పెల్లికి రండి' వాటినివాటిని వినడానికి చాలా కష్టంగా ఉంటోంది.
ఎన్నెల గారు ! తెలుగులో మాట్లాడటం నేరమని భావించే
వాళ్ళను ఏమీ చేయలేము.
జ్యోతిర్మయి గారు ! తెలుగు భాషఫై మీకున్న అభిమానానికి
ధన్యవాదాలు.
Post a Comment