”శోధిని”

Thursday, 29 September 2011

అవినీతిని అంతం చేద్దాం!

       అన్నాహజారే ప్రారంభించిన అవినీతి ఉద్యమం యావత్ భారతావనికి స్పుర్తినిచ్చింది.  పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అంతా అవినీతిపైనే మాట్లాడుకోవడం శుభసూచకం. నేడు దేశమంతా  అవినీతి అల్లుకుపోవడంతో దేశ ప్రతిష్ట్ట మసక బారుతోంది. అన్ని రంగాలలోను అవినీతి జలగలు పాతుకుపోయాయి. సామాన్యుడు  ప్రభుత్వ కార్యాలయాలకు పనులకోసం వెళ్ళినప్పుడు అక్కడ అవినీతిపరులతో తీవ్ర ఇబ్బందులకు గురవడం చూస్తున్నాము.ఈ అవినీతి భూతాన్ని అంతం చేయడానికి  ఒక బలమైన  స్వయం ప్రతిపత్తిగల చట్టం కావాలి. ఈ చట్టాన్ని అమలు పరచే వారిలో చిత్తశుద్ధి ఉండాలి.  దీనిపై సందేహాలుంటే, వాటిని పరిష్కరించడానికి ప్రధాన న్యాయమూర్తుల సలహాలు తీసుకోవాలి.  అవినీతిలేని సమాజాన్ని చూడాలంటే ప్రతి వ్యక్తి నీతి నిజాయితీగా ఉండాలి. వృత్తి పరంగా  అవినీతిని  ఎంతవరకు నిరోధిస్తున్నమన్నది ఎవరికివారే ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశంలోని పతివ్యక్తి ఒక అన్నా హజారేలా మారి తమవంతు భాద్యతగా అవినీతిపై ఉద్యమించాలి.  ఇలా పతిఒక్కరు చిత్తశుద్దితో పనిచేస్తే అవినీతిరక్కసిని అంతం చేయవచ్చు.

No comments: