ప్రజల భాధలను అర్థం చేసుకోండి!
గత రెండు వారాలనుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా జిల్లాలలో పడకేసింది. ప్రభుత్వ సర్వీసులు కోమాలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రజలు పడే భాధలను అడిగేనాధుడే కరువయ్యారు. ఇటు రాజకీయ పార్టీలు అటు ప్రభుత్వాల నడుమ ప్రజలు నలిగి పోతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే వాళ్ళు లేక అనాదులుగా మిగిలిపోతున్నారు. ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ఆటో చార్జీలు విపరీతంగా పెంచి ప్రజలను యిబ్బందికి గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పజాప్రతినిధులు మాత్రం మిన్నకుండి పోవడం ప్రజల దురదృష్టం. ఇప్పటికయినా అన్నిపార్టీలు కలిసి తెలంగాణా పరిష్కారానికి కృషి చేయాలి. రెండు ప్రాంతాలవారు ఒకచోట సమావేసమయి ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకొని తెలంగాణా సమస్యను పరిష్కరించుకోవాలి. త్వరగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణా సమస్యకు పరిష్కారం చెప్పాలని ప్రజలు వేడుకుంటున్నారు.
No comments:
Post a Comment