”శోధిని”

Saturday 23 March 2013

మనోహర పుష్పం!



వికసించే కుసుమానివి
విరజిమ్మే సుగందానివి
విరిసే పరిమళానివి
కురిసే మమకారానివి
మురిపించే అనురాగానివి
మైమరపించే భావానివి
ప్రేమను పంచే ప్రాణానివి
ఆప్యాయతఅపురూపావివి
నువ్వొక మనోహర పుష్పానివి 




Thursday 21 March 2013

కళ్ళల్లో మెరిసావు


నువ్వు గానం చేస్తుంటే
తుషార బిందువులు
నాట్యం చేస్తున్నట్టు....
నువ్వు మాట్లాడుతుంటే
పరిమళాలు విరజిమ్మినట్టు....
నువ్వు నవ్వుతుంటే
మల్లెపూలు విచ్చుకున్నట్టు....
నీ  సౌందర్య సోయగాలు
నా ఎదలో ప్రవహిస్తుంటే....
                     కళ్ళల్లో  మెరిసావు
                     చూపుల్లో నిలిచావు 


Tuesday 19 March 2013

రమణీయం




రమణీయం
రాధామాధవుల ప్రేమ మధుర కలశం
రెండు పవిత్ర హృదయాల దివ్యసంగమం
స్వచ్చమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం
ఎంత ఆస్వాదిస్తే అంతా రమణీయం












Monday 18 March 2013

భార్యా భర్తలు




          నదిలో అలలు  ఎంత సహజమో సంసారంలో కలతలు కూడా అంతే సహజం. అల ఎంత ఎగిరిపడినా  నదిని విడిచి ఉండలేదు. అదేవిధంగా  భార్యాభర్తలిద్దరూ ఒకరినిఒకరు అర్థం చేసుకోవడంతో పాటుగా ఒకర్నిఒకరు పరస్పరం  గౌరవించుకోవాలిఆధిపత్యం కోసం గొడవలు పడకూడదుఅన్నిటిని మించి ఇద్దరికీ సహనం ఉండాలి.  ఒకరు కోపంతో ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండాలి.  అప్పుడే సంసారం ముందుకు సాగుతుంది.  సంసారంలో  ఎంతటి తీవ్ర స్థాయిలో కలతలు చోటు చేసుకున్నా భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకూడదు. వ్యక్తిగత విషయాలలో పరాయి వ్యక్తులకు తావివ్వకూడదు

           భార్యాభర్తలు  సరసాలు, చమత్కారాలకు దగ్గరగా ఉంటూ  చిరాకులు, పరాకులకు దూరంగా ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ అనేది లేకుంటే భవిష్యత్తు శూన్యమనిపిస్తుందిజీవితం అందకారమవుతుందిభర్తతో ఆనందంగా జీవించాలంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యంభార్యతో సుఖంగా జీవించాలంటే ఆమెను ప్రేమగా చూసుకోవడం అవసరం.
          

Friday 15 March 2013

మన ప్రేమబంధం!











ఆప్యాయతలో---   
అమ్మను మించిన బంధం
నమ్మకంలో---
నాన్నను మించిన అనుబంధం
అనురాగంలో ---
ఆది దంపతుల సంబంధం
మన ప్రేమబంధం.

Saturday 9 March 2013

'ఓం నమశ్శివాయ'




శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి.  అందుకే  ఈ శుభకరమైన శివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం.  అయితే కేవలం ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే సరిపొదు.  అనుక్షణం 'ఓం నమశ్శివాయ' అనే శివపంచాక్షరి మంత్రాన్ని పటిస్తూ... మనసును పవిత్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవాలి.  మనసులో నేనే గొప్ప అనే అహంకారాన్ని పెట్టుకుని ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. అహంభావాన్ని వదలి, అహంకారాన్ని వీడి అందరిని సమభావంతో ప్రేమిస్తే శివుని కరుణాకటాక్షం తప్పక లభిస్తుంది. ఈ  శివరాత్రి పర్వదినాన ప్రజలందరికి శంకరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం. 


Saturday 2 March 2013

ముఖారవిందం!




నీ ముఖారవిందం 
మంచులో తడిసిన గులాబీలా... 
నీ చిరు నగవు  
వర్షంలో విరిసిన మందారంలా...  
నీ చిగురాకు చూపు 
ఉదయాన విరిసిన కలువులా... 
నీ మెరిసే అధరాలు 
తేనెలూరు మకరందంలా... 
ప్రతిబింబిస్తున్నాయి 
నీ అందాన్ని ద్విగుణీకృతం చెస్తున్నాయి. 




Friday 1 March 2013

నువ్వంటే ఇష్టం!




ఓపెన్ గా మాట్లాడుతూ 
నిజాయితీగా వుంటూ 
నిత్యనూతనంగా 
నా హృదిలో  
ప్రేమ దీపాన్ని వెలిగించావు 
నీ ఆప్యాయతానురాగాల్లో 
నన్ను ముంచావు 
నీ ప్రేమను శ్వాసిస్తూ
నీ ప్రేమ సాగరంలో 
ఓలలాడుతున్నాను 
అందుకే నవ్వంటే ఇష్టం 
నీ ప్రేమంటే మరీ ఇష్టం!