Saturday, 20 February 2021
Wednesday, 30 December 2020
Thursday, 24 December 2020
క్రిస్మస్ శుభాకాంక్షలు !
మన మనసును పరిశుద్ధంగా వుంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. దాంతో సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదం, ఆశీస్సులు మనకు లభిస్తాయి. ఇతరుల సంతోషం కోసం, వారి సుఖసౌఖ్యాల కోసం ప్రార్థన చేయమని, సాటి మనిషిని మనస్పూర్తిగా ప్రేమించమని ఏసుక్రీస్తు చెప్పాడు. ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని ఆయన చెప్పాడు. అందుకే ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి.
మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు
!
Saturday, 24 October 2020
'బతుకమ్మ పండుగ' శుభాకాంక్షలు!
దేవిశరన్నవరాత్రులలో ప్రకృతిని ఆరాధించే పెద్దపండుగ బతుకమ్మ పండుగ. అసమానతలను ఎదురిద్దాం...ఆత్మగౌరవంతో బతుకుదాం అంటూ ఆడపడుచులు ఉత్సాహంగా , ఆనందంగా ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ముత్తయిదువులంతా గౌరీదేవి దీవెనలను కోరుతూ... తమ మాంగల్య సౌభాగ్యం చల్లగా ఉండాలని ప్రార్థిస్తే, యువతులు తమకు మంచి భర్త లభించి, దాంపత్య జీవనం సుఖసంతోషాలతో సాగాలని వేడుకుంటారు. కుల, మతాలకతీతంగా వాడవాడలో జరుపుకునే బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని, మహిళలను గౌరవించాలని.
Thursday, 3 September 2020
Monday, 10 August 2020
శ్రావణమాసం పవిత్రత
సృష్టి, స్థితి లయకారిణి అయిన అమ్మవారు అనంత శక్తి స్వరూపిని. ఈ ప్రపంచమంతా సర్వం తానై ఇమిడి ఉంది. పవిత్రమైన శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని నిండు మనసుతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.







