సర్వ జీవకోటికి ఆయువుపట్టు అయిన చెట్లను నరకడం ఆపి, మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి. పరిసరాలన్నింటిని పచ్చని చెట్లు నాటితే, భూమాత చల్లగా ఉంటుంది. నాటిన చెట్లను సంరక్షిస్తే, కోట్ల వృక్షాలు పుట్టుకొస్తాయి. దీంతో వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. పచ్చదనం మీదే ప్రపంచం ఆధారపడివుందన్న విషయం మరవద్దు. పచ్చదనం అంటే హడాహుడిగా మొక్కలను నాటి, ఆ తర్వాత వాటి సంరక్షణను మరచిపోవడం కాదు. మొక్కలను నాటడంపై ఉన్న శ్రద్ధ పోషణలో కనిపించాలి.
Thursday, 13 July 2017
Wednesday, 5 July 2017
Sunday, 25 June 2017
పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు!
పవిత్ర రంజాన్ మాసం అత్యంత శుభప్రదమైనది. ఎనలేని శుభాలను అందించే ఈ నెలంతా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి జీవనసాఫల్యానికి కావాల్సిన అనేక విషయాలు ఈ మాసంతో ముడిపడి ఉన్నాయి. అంతేకాకుండా ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించడంతో ఈ పవిత్ర గ్రంధం సమస్త మానవాళికి మార్గదర్శిని అయ్యింది. అందుకే ఈ మాసమంతా పవిత్రం, పుణ్యదాయకం. శుభాల సిరులు అందించే రంజాన్ పండుగ శాంతి, సమానత్వం, సామరస్యం, సోదరభావాలకు పునాది వేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోది చేస్తుంది. రంజాన్ మాసం చివరి రోజున ఉపవాసాలు ముగించి, ఆనందం వెల్లివిరిసిన హృదయంతో రంజాన్ పండుగను అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాలతో శోభాయమానంగా జరుపుకోవాలని ఆశిస్తూ...
మిత్రులందరికీ పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు!
Thursday, 22 June 2017
"మన ఊపిరి "
ఎక్కడి నుంచో గాలికి కొట్టుకొచ్చిన చిన్న విత్తనం నేలపైన పడి చెట్టయి, పక్షులకు తోడునీడయి, వాటి పాలిత అన్నపూర్ణ అవుతుంది. అంతేకాకుండా మనుషుల ప్రాణాలనుతోడే విషవాయువులను స్వీకరించి, జీవుల ప్రాణదాతగా జగతి, ప్రగతికి కొత్త ఊపిరినిస్తుంది. చివరికి చెట్టు చనిపోయినాకూడా మానవ అవసరాలకు పనికొస్తుంది. అందుకేనేమో మన పూర్వీకులు చెట్టును పూజించేవారు.
Saturday, 17 June 2017
Monday, 12 June 2017
Subscribe to:
Posts (Atom)





