జన్మనిచ్చి జీవితాన్ని పంచిన తొలి దైవం .... కళ్ళముందు ఉండే మరో బ్రాహ్మ అమ్మ. నవమాసాలు మోసి జన్మనిచ్చి, అనురాగ ఆత్మీయాలను పంచే మరపురాని మరువలేని మాతృమూర్తి అమ్మ. కన్నబిడ్డలకు ఉగ్గుపాలతో స్పర్శనిచ్చి వాళ్ళ భవిషత్తుకు పునాదివేసే అమృత వర్షిని. అందుకే అమ్మతో పోల్చడానికి ఈ ప్రపంచంలో ఏదీ సాటి రాదు. ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది అమ్మ ఋణం. బిడ్డల శ్రేయస్సే తన జీవితాశయంగా భావించే అమ్మ అంటే ఎవరో కాదు ప్రేమకు ప్రతి రూపం... మమతల మకరందం. దేవుడున్నాడో లేదో తెలియదు కానీ మనకు జన్మ నిచ్చిన తల్లే ప్రత్యక్ష దైవం. అందుకే ప్రతిఒక్కరూ అమ్మ అనే స్త్రీ మూర్తులను గౌరవిద్దాం. మాతృమూర్తి అయిన 'స్త్రీ'ని దైవసమానులుగా భావిద్దాం. ఏడాది ఒక్కసారి వచ్చే మాతృదినోత్సవం రోజునే అమ్మను గుర్తుచేసుకోవడం గొప్పకాదు. కన్నతల్లిని ప్రతిరోజూ గుర్తుచేసుకుంటూ... అమ్మను కంటికి రెప్పలా చూసుకొన్ననాడే నిజమైన మాతృదినోత్సవం.
Saturday, 13 May 2017
Sunday, 30 April 2017
నేడే...మేడే !
ప్రపంచానికి శ్రమ విలువను చాటి చెప్పి, శ్రమజీవుల బ్రతుకులలో వెలుగు నింపిన రోజు 'మే' డే. అప్పటి నుంచి కార్మిక శక్తికి ప్రతిరూపమైన మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. కానీ, ఈనాడు ప్రభుత్వ కార్యాలయాలలోతప్ప ప్రైవేటు కర్మాగారాలలో మాత్రం ఇప్పటికి కార్మికుల చేత పశువుల్లా పని చేయించుకుంటున్నారు. దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక, సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు. ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపిన రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.
కార్మిక సోదర సోదరీమణులందరికీ 'మే' డే శుభాకాంక్షలు!
Wednesday, 26 April 2017
Friday, 21 April 2017
పుడమితల్లి ఆవేదన !
ఆధునిక అవసరాల పేరుతో...
కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ...
ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు
ధన సంపాదన కోసం...
నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ...
అత్యంత దయనీయంగా, క్రూరంగా
పెనువిద్వంసం సృష్టిస్తూ...
మన కళ్ళను మనమే పొడుచుకుంటున్నాం
మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం
ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు
రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలాడుతున్నాయి
పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం
మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !
కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ...
ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు
ధన సంపాదన కోసం...
నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ...
అత్యంత దయనీయంగా, క్రూరంగా
పెనువిద్వంసం సృష్టిస్తూ...
మన కళ్ళను మనమే పొడుచుకుంటున్నాం
మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం
ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు
రెక్కలు తెగిన పక్షుల్లా విలవిలాడుతున్నాయి
పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం
మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !
Wednesday, 12 April 2017
నమస్కారానికి ప్రతినమస్కారం !
పరిచయస్తులు ఎదురయినప్పుడు నమస్కరించడం మనదేశ సంప్రదాయం. అంత మాత్రాన మనకంటే వారు ఎక్కువ అన్న భావన కాదు. అందుకు ప్రతిగా అవతల వ్యక్తి కూడా ప్రతి నమస్కారం చేయడం సభ్యత అనిపించుకుంటుంది. నమస్కారం అన్నది ఆత్మీయతతో కూడిన పలకరింపు. ఇలా ఒకరికొకరు గౌరవించుకోవడం వలన మానవ సంబంధాలు బలోపేతం అవుతాయి.
Monday, 10 April 2017
నమ్మినబంటు
వాయుదేవుని
అనుగ్రహంతో కేసరి, అంజనకు జన్మించినవాడు హనుమంతుడు. సూర్యభగవానుడి
దగ్గర వేదశాస్త్రాలు అభ్యసించిన ఆంజనేయుడు భక్తులలో అగ్రగణ్యుడు.
అపారగునసంపన్నుడు. అంతేకాదు తేజోసంపన్నుడు, గుణవంతుడు, వినయవంతుడు. శ్రీరామభక్తుడు, నమ్మినబంటు, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన శ్రీ ఆంజనేయస్వామిని పూజించిన
వారికి, స్తుతించినవారికి గ్రహదోషాలు దూరమవుతాయని, శ్రీరాముని అనుగ్రహం
లభిస్తుందని భక్తుల నమ్మకం.
Thursday, 6 April 2017
Subscribe to:
Posts (Atom)





