Sunday, 8 January 2017
Saturday, 31 December 2016
Friday, 30 December 2016
Tuesday, 27 December 2016
విజయవంతంకాని (మైన) 50వ రోజు
నల్లధనాన్ని, నకిలీని కట్టడిచేయాలని ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన చర్యే అయినా, ఆదెబ్బకు దేశం మొత్తం డబ్బు సమస్యతో అతలాకుతలమైపోయింది. నల్లధనస్వాములు మాత్రం హాయిగా ఉన్నారు. కోట్ల రూపాయల కొత్తనోట్లు బడాబాబుల ఇంట్లోకి చేరిపోయాయి. ఎటొచ్చి సామాన్యులే బ్యాంకులు, ఏటీఎంల దగ్గర చేంతాడంత పొడవైన క్యూలో అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకుల్లో డబ్బుఉండికూడా డబ్బును తీసుకోలేని పరిస్థితి. ఇంటశుభకార్యాలు తలపెట్టుకున్నవాళ్ళు నోట్లవేతలతో తల పట్టుకుంటున్నారు. ఇది ప్రజల సహనానికి ప్రభుత్వం పెట్టిన పెద్ద పరీక్ష. గత 50 రోజులుగా దేశంలోని ప్రజలు నరకమంటే ఏమిటో చవిచూస్తున్నారు. కొత్త సంవత్సరంలోనైనా నోట్లపాట్లు తీరుతాయో లేదో ఆ భగవంతుడుకే తెలియాలి.
Monday, 26 December 2016
Saturday, 24 December 2016
మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు !
మనం ఎదుటివారిని మనస్పూర్తిగా ప్రేమిస్తే ...మనల్ని కూడా అవతలి వాళ్ళు అంతే ఇష్టంగా ప్రేమిస్తారు. సాటి మనిషిని మనస్పూర్తిగా ప్రేమించమని ఏసు చెప్పాడు. స్వార్థపూరితమైన ప్రార్థనలు కాకుండా ఇతరుల సంతోషం కోసం, వారి సుఖసౌఖ్యాల కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. నీతి, నిజాయితీగా నడిస్తే ఏసుక్రీస్తు ఎంతగానో సంతోషిస్తాడు. మన మనసు పరిశుద్ధంగా వుంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదం, ఆశీస్సులు లభిస్తాయి.
Monday, 19 December 2016
మంచి నేస్తం !
చికాకులన్నీ ఎగిరిపోవడానికి
చిరునవ్వు చాలు
కన్నీళ్లు ఆగిపోవడానికి
చల్లనిచూపు చాలు
గుండె మంటను చల్లార్చడానికి
తియ్యటి మాటలు చాలు
నేనున్నాననే భారోసానివ్వడానికి
మంచి నేస్తం దొరికితే చాలు !
చిరునవ్వు చాలు
కన్నీళ్లు ఆగిపోవడానికి
చల్లనిచూపు చాలు
గుండె మంటను చల్లార్చడానికి
తియ్యటి మాటలు చాలు
నేనున్నాననే భారోసానివ్వడానికి
మంచి నేస్తం దొరికితే చాలు !
Subscribe to:
Posts (Atom)





