Wednesday, 13 April 2016
Monday, 11 April 2016
అనురాగ శివుడు !
శివతత్వమంటే...ప్రేమతత్వం
శివతత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే ..
శివుడినిలా మెలగడం !
పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ...
నోరారా 'శివా' అని స్మరిస్తూ ...
చెంబుడు నీళ్ళు ఆయన శిరస్సు పైన పోస్తే...
ప్రసన్నుడయి పోతాడు
మనం గోరంత అడిగితే..
కొండంత ఇచ్చేబోళాశంకరుడు
'శివా' అని స్మరిస్తే ...
శుభకరం ...మంగళకరం !
Thursday, 7 April 2016
నూతన తెలుగు సంవత్సరానికి స్వాగతం !
ఉగాది అంటే ...
కోయిల కుహు కుహూ రాగాలు
పక్షుల కిలకిలా రావాలు
పచ్చదనపు చిగుళ్ళు
రంగురంగు పూల పరిమళాలు
మధురమైన పండ్ల రుచులు
సరికొత్త అనుభూతులు !
అంతే కాదు ...
కష్ట సుఖాలు, చీకటి వెలుగులను
ఒకేలా స్వీకరించాలని,
ఆనందాన్ని, బాధలను
సమానంగా చూడాలని చెప్పేది
షడ్రుచుల ఉగాది పచ్చడి !
ఈ ప్రకృతి పండుగ పర్వదినాన
మనసును ఆహ్లాదకరమైన
ఆలోచనలతోనింపితే ...
జీవితం సుఖమయం అవుతుంది.
Saturday, 2 April 2016
Sunday, 27 March 2016
Tuesday, 22 March 2016
నీటి పొదుపు అంటే ఇదేనా ?
ఒక చిత్రంలో 'నీటి పొదుపు' మహోధ్యమంలో పాల్గొన్న యువత.
మరో చిత్రంలో 'హోలీ' పేరుతో బక్కెట్ల బక్కెట్ల నీళ్ళు వృధా చేస్తున్న యువత. రాష్ట్రంలో నీటి కొరత వేధిస్తోంది. హోలీ పేరుతో ఇలా నీటిని వృధా చేయడం ఎంతవరకు సమంజసం యువత ఆలోచించాలి. మన సంప్రదాయం ప్రకారం సహజ రంగులతో హోలీ ఆడి, స్నానం చేస్తే, ఎంతో అముల్యమైన నీటిని ఆదా చేసినట్లు అవుతుంది.
Subscribe to:
Posts (Atom)




