”శోధిని”

Sunday, 6 March 2016

శంభో శంకర నమో నమో ...!


శివరాత్రి  భక్తులకు అత్యంత పర్వదినం.  ఈ రోజున ఉపవాసం ఉంటూ పరమేశ్వరుడ్ని ఆరాధించి,  జాగారణ చేస్తే అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయని శివపురాణం చెబుతుంది.  శివారాత్రి రోజున  శివునికి దగ్గరగా ఉంటూ, ఆయన నామాన్ని స్మరిస్తూ... ఆరాధించాలి.  శివుడ్ని స్తుతిస్తూ... కీర్తిస్తూ ఉపవాసంతో కూడిన జాగారం చేయాలి.  ఆయన కోరుకునేది చెంబుడు నీళ్ళతో అభిషేకం, గుప్పెడు బిల్వపత్రాలు మాత్రమే!   ఇలా చేయడం వల్ల ఆయన ఆనందంతో పొంగిపోతాడు.  శివరాత్రి రోజున 'ఓం నమఃశ్శివాయ' అంటూ పంచాక్షరీ శివనామ స్మరణతో  శివాలయాలన్నీ  మరుమ్రోగుతాయి.  భక్తితో భక్తుల హృదయాలు  పులకించిపోతాయి.

            మిత్రులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ! 





 

Wednesday, 2 March 2016

"నిజం నిప్పులాంటిది"

"నీ స్నేహితుడ్ని అతి దారుణంగా కాల్చి చంపావంటున్నారు పోలీసులు నిజమేనా?" బోనులో నిలబడ్డ వ్యక్తిని అడిగాడు లాయర్.
" ఈ హత్య నేను చేయలేదు సార్ ! " చెప్పాడు నేరస్థుడు
"అయితే పిస్తోల్ పైన నీ వేలి ముద్రలు ఉన్నాయంటున్నారు"
"వాళ్ళు చెప్పేది పచ్చి అబద్దం! అవి నా వేలి ముద్రలు కావు. ఎందుకంటే అప్పుడు నా చేతులకు గ్లౌజులున్నాయి "
లాయర్ గారు  అయోమయంగా చూశాడు నేరస్థుడి వైపు.

Monday, 29 February 2016

'ఆరోగ్య రహస్యం'

తాయారు : ఏంటి మీ ఆయన అప్పుడే దీక్ష విరమించాడు ?
ఆండాలు :  డాక్టర్ తగ్గమన్న అయిదు కేజీల బరువు తగ్గాడు. అటు పబ్లిసిటి పెరిగింది, ఇటు  ఆరోగ్యం బాగుపడింది. అందుకే దీక్ష విరమించాడు. 
తాయారు : మీవారు దీక్ష చేసింది  ప్రజల కోసం కాదా ?
ఆండాలు : మాగురించి పట్టించుకునే తీరికే లేదు, ఇక ప్రజల గురించి ఏం ఆలోచిస్తాం ?
తాయారు : ఈ 'ఆరోగ్య రహస్యం' మా వారికి చెప్పి, ఏదొక సమస్యను  హైలేట్ చేసి దీక్ష చేయిస్తాను.

 

Monday, 15 February 2016

ప్రేమ పుష్పం !


ఇష్టం కళ్లలో కాకుండా 
మనసులోఉంటే ...
గుండెల నిండా...
అమృతపు జల్లులే  !
మదినిండా ...
ఆనందపు మల్లెలే  !!