పాత తెలుగు సినిమాలలో మంచి కథ, నీతి, మితిమీరని శృంగారం, వినసొంపయిన మధురమైన పాటలు, సున్నితమైన హాస్యం ఉండేవి. నాయికా నాయకులు నీతిని బోధించే పాత్రలు ధరించేవారు. అవినీతి, చెడుపై విజయంగా మంచి నీతిని ప్రబోధించేవారు. ఆ దిశగా రచయితలు కూడా రచనలు చేసేవారు. వాటి ప్రభావం సమాజంపై ఉండేది. మంచిని చూపించడంవల్ల ప్రజలకు సినిమాలపైన మంచి అభిప్రాయం ఉండేది. కానీ, నేడు వస్తున్న సినిమాలలో అతి జుగుస్సాకరమైన మాటలు, వస్త్రధారణ, సన్నివేశాలు, పోరాటాలతో దేశంలోని చెడునంతా నింపేస్తున్నారు. కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తున్నారే తప్ప, అన్ని వర్గాల పేక్షకులను ఉపయోగపడే సినిమాలను నిర్మించడం లేదు. దాంతో కుటుంబసమేతంగా సినిమాలు చూసే అవకాశం లేకుండా పోతోంది.
Wednesday, 7 October 2015
Monday, 5 October 2015
Thursday, 1 October 2015
Tuesday, 29 September 2015
Sunday, 27 September 2015
Saturday, 26 September 2015
వీధి కుక్కల బెడద !
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ వున్న నగర శివారు ప్రాంతాలలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రదానంగా కాలనీలలో వీధి కుక్కల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా గుంపులుగా సంచరిస్తూ, వింత అరుపులతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి కాటుకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి రోజు ఏదొక చోట కుక్క కాటుకు గురయిన వార్తలే వినిపిస్తున్నాయి. అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కుక్కల నియంత్రన కోసం చర్యలు తీసుకున్నట్టు కనబడటం లేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కుక్కల నియంత్రణకు తగు చర్యలు చేపడితే బాగుంటుంది.
Subscribe to:
Posts (Atom)



