”శోధిని”

Sunday, 13 September 2015

మన తెలుగు టీవీ ఛానల్స్ !

         ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ చూస్తుంటే...అసలు మనుషుల మధ్య సత్సంబంధాలు, కుటుంబసభ్యుల మధ్య అభిమానాలు ఉండావా ?  ప్రపంచమంతా మెచ్చుకునే  మన కుటుంబ వ్యవస్థ విలువలేమయ్యాయి ?  అనే సందేహం కలగకమానదు.  ఎందుకంటే మన తెలుగు టీవీ సీరియల్స్ లో మగాడికి రెండు పెళ్లిళ్లు, వివాహేతర సంబంధాలు,  అత్తాకోడళ్ళు, తోడికోడళ్ళ  మధ్య పోరు, పగలు, ప్రతీకారాలు.  డానికి తోడు కుట్రలు కుతంత్రాలు...మంత్రం తంత్రాలు.

       చిన్న పిల్లల చేత పిచ్చి డ్యాన్స్ లు, అసభ్యకరమైన దుస్తులు వేయించడం.  హాస్య కార్యక్రమం పేరుతొ మగవాళ్ళు ఆడవేషాలు  వేస్తూ, ద్వంద అర్థాలతో కూడిన డైలాగులతో హాస్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.  ఒకరునొకరు కొట్టుకోవడం, జడ్జీలు విరగపడి నవ్వడం... ఇవ్వన్నీ చూస్తుంటే మనకు పిచ్చి ఎక్కడం ఖాయం.  


Friday, 11 September 2015

గణేష్ ఉత్సవాల సందడి !

      


వినాయకచవితికి చందాలు వాసులు చేసే కార్యక్రమం మొదలయింది.  నిర్వహకులు పెద్ద విగ్రహాలను ప్రతిష్టించాలని చూస్తున్నారు తప్ప,  తర్వాత ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని గురించి  ఆలోచించడం లేదు.  వినాయకుని విగ్రహాలు ప్రతిష్టించే వారు ఎత్తు తక్కువున్న మట్టి గణనాథులను ప్రతిష్టిస్తే, పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు చేతి వృత్తుల వారికి సహకారం అందించిన వారవుతారు.  కొందరు వెకిలితనంతో వినాయకుడు ఫిడేల్ వాయుస్తున్నట్టుగా, మద్దెల మోగిస్తున్నట్టుగా, మోటారుసైకిల్ మీద వెడుతున్నట్టుగా  ఎవరి వంకర బుర్రకు ఏ ఆలోచన తడితే ఆ తీరుగా వినాయకుడుని తయారుచేస్తూ మహా అపచారం చేస్తున్నారు.  ఈ విపరీత ధోరణి మారాలి.  గణనాథుడు ఎలా ఉంటాడో అలా తయారు చేసిన వినాయకుడుని ప్రతిష్టించి, భక్తిశ్రద్దలతో పూజించి మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడండీ.  పండుగలు, ఉత్సవాలు సమాజహితాన్ని కోరాలి.  గణేష్ నవరాత్రులు  పూర్తిగా భక్తీ ప్రధానంగా, సమాజహితంగా నిర్వహించబడాలి.  మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, శబ్ధ కాలుష్యాన్ని నివారించి, పర్యావరణానికి హాని కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనపైన ఉందని మరచిపోకూడదు.

 

Thursday, 10 September 2015

ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ...





భూమికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం పోరాడిన వీరనారి ఐలమ్మ వర్ధంతి నేడు. ఐలమ్మ తెగింపు, దైర్యసాహసం, స్పూర్తి, పోరాటం కావాలి నీటి మహిళలకు.






ఈ వర్షం సాక్షిగా ...


Friday, 4 September 2015

గురుదేవులకు వందనాలు !



అక్షరజ్యోతుల్ని వెలిగించి ...
విజ్ఞానాన్ని అందిస్తూ ...
క్రమశిక్షణ నేర్పిస్తూ ...
విద్యార్థుల లక్షసాధనకు
పునాది వేసేవారు
విద్యార్థి వ్యక్తిత్వం, ప్రవర్తనపై
బలమైన ముద్రవేసేవారు 
గురువులు !
విద్యార్థులలో స్పూర్తిని నింపి 
విజయం వైపు నడిపిస్తూ ...
తమలో దాగివున్న 
గొప్ప విషయాలను బోధిస్తూ ...
భావితరాలను తీర్చిదిద్దుతున్న 
గురుదేవులకు వందనాలు  !!