”శోధిని”

Friday, 11 September 2015

గణేష్ ఉత్సవాల సందడి !

      


వినాయకచవితికి చందాలు వాసులు చేసే కార్యక్రమం మొదలయింది.  నిర్వహకులు పెద్ద విగ్రహాలను ప్రతిష్టించాలని చూస్తున్నారు తప్ప,  తర్వాత ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని గురించి  ఆలోచించడం లేదు.  వినాయకుని విగ్రహాలు ప్రతిష్టించే వారు ఎత్తు తక్కువున్న మట్టి గణనాథులను ప్రతిష్టిస్తే, పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు చేతి వృత్తుల వారికి సహకారం అందించిన వారవుతారు.  కొందరు వెకిలితనంతో వినాయకుడు ఫిడేల్ వాయుస్తున్నట్టుగా, మద్దెల మోగిస్తున్నట్టుగా, మోటారుసైకిల్ మీద వెడుతున్నట్టుగా  ఎవరి వంకర బుర్రకు ఏ ఆలోచన తడితే ఆ తీరుగా వినాయకుడుని తయారుచేస్తూ మహా అపచారం చేస్తున్నారు.  ఈ విపరీత ధోరణి మారాలి.  గణనాథుడు ఎలా ఉంటాడో అలా తయారు చేసిన వినాయకుడుని ప్రతిష్టించి, భక్తిశ్రద్దలతో పూజించి మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడండీ.  పండుగలు, ఉత్సవాలు సమాజహితాన్ని కోరాలి.  గణేష్ నవరాత్రులు  పూర్తిగా భక్తీ ప్రధానంగా, సమాజహితంగా నిర్వహించబడాలి.  మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, శబ్ధ కాలుష్యాన్ని నివారించి, పర్యావరణానికి హాని కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనపైన ఉందని మరచిపోకూడదు.

 

Thursday, 10 September 2015

ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ...





భూమికోసం, వెట్టిచాకిరి విముక్తికోసం పోరాడిన వీరనారి ఐలమ్మ వర్ధంతి నేడు. ఐలమ్మ తెగింపు, దైర్యసాహసం, స్పూర్తి, పోరాటం కావాలి నీటి మహిళలకు.






ఈ వర్షం సాక్షిగా ...


Friday, 4 September 2015

గురుదేవులకు వందనాలు !



అక్షరజ్యోతుల్ని వెలిగించి ...
విజ్ఞానాన్ని అందిస్తూ ...
క్రమశిక్షణ నేర్పిస్తూ ...
విద్యార్థుల లక్షసాధనకు
పునాది వేసేవారు
విద్యార్థి వ్యక్తిత్వం, ప్రవర్తనపై
బలమైన ముద్రవేసేవారు 
గురువులు !
విద్యార్థులలో స్పూర్తిని నింపి 
విజయం వైపు నడిపిస్తూ ...
తమలో దాగివున్న 
గొప్ప విషయాలను బోధిస్తూ ...
భావితరాలను తీర్చిదిద్దుతున్న 
గురుదేవులకు వందనాలు  !!


Wednesday, 2 September 2015

మంచి మనసుకు స్వాగతం !

నెమలి చూడటానికి చాలా అందంగా ఉంటుంది.  కాని అది గొంతు విప్పితే కర్ణ కఠోరంగా ఉంటుంది.
ఏమాత్రం అందంలేని నల్లని కోకిల గొంతు ఎంతో శ్రావ్యంగా...మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
మనిషి కుడా అంతే! చాలా తెల్లగా అందంగా ఉండవచ్చు.  కాని మనసు  నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఆ అందం మంచు కడిగిన మల్లెపువ్వులా ఉంటుంది.