”శోధిని”

Saturday, 9 May 2015

మాతృ ప్రేమ మాధుర్యం !

కడుపు మండుతున్నా ...
గొంతుఎండిపోతున్నా...
బిడ్డ ఆకలి తీర్చేందుకు 
తల్లడిల్లే మాతృ హృదయం 
ఆమెకు బిడ్డ ఆకలి తప్ప 
తన ఆకలి తెలియదు
ప్రేమను పంచడం తప్ప
ప్రేమను ఆశించదు
మాతృ ప్రేమలోని మాధుర్యం 
మాటల్లో చెప్పలేనిది
ఆమె త్యాగం అమూల్యం 
అందుకే ఆమె త్యాగమూర్తి
ప్రేమాభిమానాల పెన్నిధి !

మిత్రులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు !


జల నినాదం !






Thursday, 7 May 2015

// పెను ప్రళయం //


 ప్రకృతి విలయతాండవం
పెను ప్రళయ ప్రకంపనం
నేపాల్ భయానక భూకంపం
గుండెలను పిండేసే పెను విషాదం
హిమఖండం కంపించింది
పంచప్రాణాలను పిండేసింది
వారసత్వ సంపదను మింగేసింది 
మంచు నేలను మట్టిదిబ్బగా మార్చింది 
ప్రకృతి సౌందర్యమంతా
విషాద నిలయమయింది
తలక్రిందులైన జనజీవనం
కాలం అంచుల మీద  కన్నీటి దృశ్యాలు 
కళ్ళెదుట ఊహించని సజీవ శిల్పాలు !

Sunday, 3 May 2015

అప్పు మహత్యం (జోక్)

"రక్షించండి ... రక్షించండి" అంటూ ఒకతను చెరువులో మినిగిపోతూ అరుస్తున్నాడు.
చెరువు లోతుగా వుండటంతో అతన్ని రక్షించడానికి ఎవ్వరూ సాహసం చేయలేక పోయారు.  ఇంతలో ఒకరు ముందుకొచ్చి అక్కడున్నవాళ్ళు వద్దని వారిస్తున్నా వినకుండా చెరువులోకి దూకి, మునిగిపోతున్న అతన్ని అతి కష్టం మీద కాపాడి పైకి తీసుకొచ్చాడు.
ఓ టి.వి ఛానల్ వారికి ఈ సంఘటన ఎలా తెలిసిందో గాని అక్కడ జరిగినదంతా కెమెరాలో బంధించారు.
"ఎంతో సాహసం చేసి, ఓ నిండు ప్రాణాల్ని కాపాడావు....మానవత్వానికి కొత్త అర్థం చెప్పావు"  ఇంకా అతనికి  అర్థంకాని పెద్ద పెద్ద మాటలతో ఆ వ్యక్తిని పొగిడింది టి.వి యాంకర్.
"మానవత్వమా... పాడా  ఇతను నా దగ్గర పదివేలు  అప్పు తీసుకున్నాడు.... అందుకోసం ఇంత సాహసం చేయాల్సి వచ్చింది"  అసలు విషయం చెప్పాడు.