Saturday, 25 April 2015
Friday, 24 April 2015
Wednesday, 22 April 2015
సెల్ ఫోన్ మహత్యం !
నడుస్తున్నా, వాహనం నడుపుతున్నా, టివీ చూస్తున్నా, భోజనం చేస్తున్నా చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే! చివరికి నిద్రిస్తున్నా పక్కలో సెల్ తప్పనిసరి అయింది. ఒకప్పుడు నిద్రిస్తున్న సమయంలో పక్కన భాగస్వామి, లేకుంటే పిల్లలు ఉండేవారు. ఇప్పుడు వారి స్థానాన్ని సెల్ ఆక్రమించుకుంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరి చేతుల్లోనూ సెల్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. పక్కన వున్న వారిని సైతం పట్టించు కోకుండా ఎవరి లోకాన వారు యమా బిజీ! ఇదీ ఇప్పుడు ప్రతి ఇంట్లో కనిపించే సెల్ దృశ్యాలు. ఇలా మనిషి జీవితంలో సెల్ ఒక భాగం అయిపోయింది. ఈ సెల్ ప్రభావం మన ఆరోగ్యం పైన ఎంత ఉంటుందో సెల్ ప్రియులు ఎంత త్వరగా తెలుసు కుంటే చాలా మంచిది. అవసరానికి సెల్ అవసరమే కాని, నిత్యం అదే జీవితం కాకూడదు.
Monday, 20 April 2015
సిరిమల్లె పువ్వు !
స్వచ్చమైన మల్లెపువ్వులా, దివ్యమైన వర్చస్సుతో వెలిగిపోతున్న పదహారణాల తెలుగు అమ్మాయి 'శ్రీదివ్య' మంచినటి అని ప్రశంసలయితే దక్కాయి కాని, తెలుగు దర్శకులు, నిర్మాతలు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు. శ్రీ దివ్య నటనను గుర్తించి తమిళ చిత్ర పరిశ్రమ అవకాశాలు ఇస్తుంటే, మన దర్శకనిర్మాతలు మాత్రం మంచి నటిని మన నట్టింట్లో పెట్టుకొని తెలుగు భాష రాని ఇతర భాషల హీరోయిన్స్ ని ఎంపిక చేసుకోవడం శోచనీయం.
Thursday, 16 April 2015
Tuesday, 14 April 2015
నేటి మానవుడు !
నేడు మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారి పోతున్నాయి. ఆస్తిని పెంచుకుంటూ పరుల గురించి ఆలోచించడం మానేస్తున్నారు. ఇంటి వైశ్యాల్యం పెంచుకొంటూ... హృదయ వైశ్యాల్యం తగ్గించుకుంటున్నారు. దాంతో మానవత్వం నశిస్తూ, అణువణువునా క్రూరత్వం చోటు చేసుకుంటోంది. భోగభాగ్యాలు శాశ్వతం కాదని, ఇరుగు పొరుగు వారితో కలిసి ఉండటం... సమాజంతో సత్ సంబంధాలు ముఖ్యమని మానవుడు తెలుసుకునేదేప్పుడో !
Subscribe to:
Posts (Atom)



