”శోధిని”

Tuesday, 17 February 2015

సర్వం శివమయం !

 

మాఘమాసం బహుళ చతుర్దశినాడు పరమేశ్వరుడు జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చాడు. ఆ విధంగా అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరిగింది కాబట్టి ఈ రోజున పరమ పవిత్రమైన మహాశివరాత్రి అయింది. లింగోద్భవం సమయంలో శివారాధనకు అత్యంత ప్రాధాన్యత నివ్వడం జరిగింది. శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి.  ఈ శుభకరమైన శివరాత్రి రోజున పవిత్ర స్నానాలు, అభిషేకాలు, ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. కేవలం ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే సరిపొదు.  అనుక్షణం 'ఓం నమశ్శివాయ' అనే శివపంచాక్షరి మంత్రాన్ని పటిస్తూ... మనసును పవిత్రంగా,  ప్రశాంతంగా ఉంచుకోవాలి. పార్వతీదేవి స్వేదం నుండి వుద్బవించిన బిల్వ వృక్షాలు  శివునికి ఎంతో ప్రీతికరమైనవి.  శివునికి ఇష్టమైన బిల్వపత్రం పట్టుకున్నా శివలింగాన్ని దర్శించుకునంత ఫలితం దక్కుతుంది... ఆరోగ్యం, ఐశ్వర్యం అభిస్తాయి.   ప్రపంచంలోవున్న  సర్వ తీర్థాలు బిల్వపత్రంలో  ఉన్నాయి కాబట్టి బిల్వపత్రంతో శివలింగాన్ని పూజిస్తే ... శివుని కరుణాకటాక్షం తప్పక లభిస్తుంది. ఈ శివరాత్రి పర్వదినాన ప్రజలందరికి శంకరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం. 


Sunday, 25 January 2015

66వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !

నింగినంటిన త్రివర్ణపతకాలు ...
స్వేచ్ఛా స్వాతంత్ర్యానికి పతీకలు !
మువ్వన్నెల మెరుపులతో, భారతదేశం మురిసి పోయింది.  జాతీయపతాకాలు రెపరెపలాడాయి. గుండెలనిండా దేశభక్తిని నింపుకుని    66వ గణతంత్ర దినోత్సవానికి స్వాగతం పలుకుదాం !


Saturday, 17 January 2015

నేడు యన్.టి.ఆర్ వర్థంతి !

నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగుజాతి మన్నలను పొంది, సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస భరిత పారిజాతం యన్.టి.ఆర్.   మరపురాని  మరువలేని మహానటుడు నందమూరి తారక రామారావు గారి 19వ వర్థంతి సందర్భంగా...