Monday, 15 July 2013
Thursday, 11 July 2013
ప్రేమ కుసుమాలు!
ప్రియా...
ప్రేమను కురిపించి
ఆత్మీయతను పంచి
మమతలు నాలో నింపావు
అనురాగం అందించి
మనసంతా మల్లెలు పరచి
ప్రేమ కుసుమాల
పరిమళాలను వెదజల్లి
నా మనసును దోచావు
అందుకే...
వసంతం లాంటి
నీ రూపాన్ని
నా హృదయ ఫలకంపై
ముద్రించుకున్నాను.
Wednesday, 10 July 2013
మెరుపు తీగ!
"గబ్బర్ సింగ్" చిత్రంలో సంప్రదాయమైన దుస్తుల్లో ప్రేక్షకుల్ని అలరించిన శృతి హాసన్ లేటెస్ట్ గా "బలుపు" సినిమాలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి తన సొగసులను ప్రదర్శించింది. శృతి తప్పుతున్న శృతి తన అందాలను కడు ఉదారంగా ఆరబోయడం చూసి కమలహాసన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారట.చూపించడానికి కొంత అందం మిగుల్చుకుంటే క్రేజు ఉంటుందని ఈ ముద్దుగుమ్మకు తెలిసేదేప్పుడో?తనకు డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని ఈ మెరుపు తీగ తాపత్రయం. ఏది ఏమైనా ఈ నాటి హీరోయిన్లకు తెలివితేటలు కాస్త ఎక్కువే!
Tuesday, 9 July 2013
ప్రభుత్వ వాహనాలకు నియమాలు వర్తించవా?

రోడ్డు భద్రత దృష్ట్యా ఏ వాహనంలో అయినా పరిమితికి మించి బరువును తీసుకెళ్లడం చేయకూడదు. ఇది మంచి నిర్ణయమే. కాని, ఈ నిర్ణయాలన్నీ కేవలం ప్రైవేట్ వాహనలకే వర్తించడం, ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నడిచే వాహనాలకు, వ్యకులకు వర్తించక పోవడం ఆశ్చర్యకరమైన విషయం. ఆర్టీసి బస్సుల్లో సీట్లకు మించి ప్రయానికులను రెట్టింపు సంఖ్యలో తీసుకు వెళుతున్నారు. ప్రభుత్వ డ్రైవర్స్ ఇష్టమొచ్చినట్లు వాహనాలను నడుపుతున్నారు. బస్సులను బస్టాపులలో అసలు ఆపరు. ఒకవేళ బస్సు ఆగినా స్లో చేస్తారు తప్ప, బస్సును పూర్తిగా ఆపరు. ఇలా చేయడం వల్ల ఎంతో మంది బస్సు వెనుక టైరు కింద పడి మరణించిన సంఘటనలున్నాయి. ఏదయినా మొదట మనం పాటించి, ఆ తర్వాత ఎదుటి వారికి చెబితే బాగుంటుంది.
Monday, 8 July 2013
మహా నటి సావిత్రి
తెలుగులో గొప్ప చిత్రం ఏదని ఎవరినైనా అడిగితే వెంటనే చెప్పేది 'మాయా బజార్' అని. అలాగే తెలుగులో గొప్ప నటి ఎవరని అడిగితే 'మహా నటి సావిత్రి' అని ఎవరైనా చెబుతారు. తెలుగు ప్రేక్షకుల మనుసులను, హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న ఎకైక నటి సావిత్రి. ఆప్యాయతతో కూడిన ఆహ్లాదమైన చిరునవ్వు ఆమె సొంతం. వాత్సల్యంతో నిండిన అనురాగ పూర్వకమైన కల్మషం లేని పలకరింపు ఆమె సహజ గుణం, ఆర్థ్రత , ఆప్యాయత కురిపించే పాత్రలను ఆమె నల్లేరు మీద బండిలా పోషించి మెప్పించారు. కేవలం ముఖ కవళికల ఆధారంగా ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేయడం ఆమె సొత్తు. కంటి చూపుతో కోటి భావాలను పలికించే సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె నటించిన చిత్రాలన్నీ అసలు సిసలైన మేలిమి రత్నాలు.
అమ్మాయిలూ... జాగ్రత్త!
నేడు అమ్మాయిలు అన్ని రంగాలలో మంచి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. అబ్బాయిలతో సమానంగా రాణిస్తున్నారు. ఇది శుభ పరిణామం. కాని, ప్రేమ దగ్గరకొచ్చేసరికి పప్పులో కాలేస్తున్నారు. చచ్చు పుచ్చు కబుర్లు చెప్పే అబ్బాయిల చేతుల్లో చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నారు. మగాడి ఆలోచనా విధానం వేరని గ్రహించలేక పోతున్నారు. ప్రేమ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. అమాయకంగా ప్రేమంటూ అబ్బాయిల చేతిలో బలవుతున్నారు. ఇలా మోసపోయే అమ్మాయిలు వున్నత వరకూ మోసం చేసే అబ్బాయిలు పుడుతూనే ఉంటారు.అమ్మాయిలూ భ్రమలోంచి బయట పడండి... బాగా ఆలోచించి చక్కని భవిష్యత్తును నిర్మించుకోండి. మోసగాళ్ళ మాయమాటలు విని మోసపోకండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుందని మరచిపోకండి. మీ తెలివితేటలు ఉపయోగించి మంచి తోడును ఎన్నుకోండి.
Saturday, 6 July 2013
Subscribe to:
Posts (Atom)