”శోధిని”

Tuesday, 25 June 2013

దాంపత్య జీవితం!


మూడుముళ్ల బంధం 
ముచ్చటైన బంధం 
ఆప్యాయత, అనురాగం...  
ఆత్మీయత, అనుబంధం...  
పెనవేసుకున్న బంధం 
భార్యాభర్తల ప్రేమ  బంధం 
ఆలుమగల దాంపత్యం 
అన్యోన్య హరిత పత్రం 
మాధుర్యాన్ని ఆస్వాదించేవారికి 
దాంపత్య జీవితం 
కడు  రమణీయం 
బహు కమనీయం! 

Wednesday, 19 June 2013

ఆరోగ్యానికి వరం ... బొప్పాయి ఫలం!

 

బొప్పాయిలో ఔషద గుణాలు, పోషక విలువలు అనేకం ఉన్నాయి. ఈ పండును తింటుంటే  ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదని పెద్దలు చెబుతారు.  అయితే బొప్పాయిని మితంగా తినాలి. జీర్ణశక్తి పెరుగుతుంది, సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నొప్పులు, వాపులు, చర్మ వ్యాధులకు అమోఘంగా పనిచేస్తుంది. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల ఆయుష్షు, తేజస్సు, వర్చస్సు ఇనుమడిస్తాయి. అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. 


Tuesday, 18 June 2013

కన్నుల్లో మెరిసావు!

 
పువ్వులోని మాధుర్యాన్ని
ఆస్వాదించే తుమ్మెదలా ...
స్వచ్చమైన నీటి అలల పైన
విహరించే రాజహంసలా ...
లేతమామిడి చిగుళ్ళు తిని
పులకించిపోయే కోయిలలా...
నిండుపున్నమి వేళ
కురిచే జలతారు వెన్నెలలా...
కోవెల కొలనులో విరిసిన
అందమైన తామరపువ్వులా...
ఆత్మీయ అనుబంధాన్ని పంచుతూ
కన్నుల్లో మెరిసావు
చూపుల్లో నిలిచావు 


Monday, 17 June 2013

వినోదం అంటే ఇదేనా?



















ఈటీవీ లో వచ్చే  'జబర్దస్త్ కామెడీ షో'  హాట్ ... హాట్ యాంకర్స్ ని అందిస్తోంది.  మొదట అనసూయతో ప్రారంభమైన  'జబర్దస్త్ కామెడీ షో'లో ఆమె హావభావాలు,ఆమె ధరించే దుస్తులు టీవీ ప్రేక్షకులను కట్టిపడేశాయి.  దాంతో ఈ షో  ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. అనసూయను చూసి మన యాంకర్స్ డీలా పడిపోయారు. ఇప్పుడు అనసూయ ఛానల్ మారడంతో 'జబర్దస్త్ కామెడీ షో' కి రేష్మీ అనే  మెరుపు తీగ యాంకర్ గా దూసుకువచ్చింది. అనసూయను మరిపించేలా దుస్తులతో, తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ...  అనసూయకు గట్టిపోటీ ఇస్తోంది.  కొసమెరుపు ఏమిటంటే  'జబర్దస్త్ కామెడీ షో' చూస్తుంటే ఇది ఈటీవీ యేనా అనే అనుమానం రాక మానదు.  ఎందుకంటే ఈటీవీ లో ఇంతకు ముందు ఇలాంటి అభ్యంతకర, అశ్లీలకర సన్నివేశాల కార్యక్రమాలు రాలేదు. 'జబర్దస్త్ కామెడీ షో'లో కామెడీ శృతిమించి పోయింది. కామెడీ అంటే హాయిగా కుటుంబసమేతంగా నవ్వుకోవాలి.  కుళ్లు జోకులు, డబుల్ మీనింగ్ సంభాషణలతో రోత పుట్టిస్తున్నారు.  వినోదం అంటే ఇదేనా?

 

Saturday, 15 June 2013

ఓ నాన్నా...నీ మనసే వెన్న!


ఓ నాన్నా ఓ నాన్నా
ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్న అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా

ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి వుంచావు            //ఓ నాన్న//

పుట్టింది అమ్మ కడుపులోనైనా
పలు పట్టింది నీ చేతిలోన
ఊగింది ఉయ్యాలలోనైనా
నేను దాగింది నీ చల్లని ఒడిలోన
చల్లని ఒడిలోన                                 //ఓ నాన్న//

ఉన్న నాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి సాచనన్నావు
నీ రాచగుణమే మా మూలధనము
నీవే మాపాలి దైవము                           //ఓ నాన్న//  

Friday, 14 June 2013

చిటపట చినుకులు


















చిటపట చినుకులు పడుతుంటే... 
పుడమితల్లి పులకించింది   
మేనుపై జాలువారే చినుకులకు 
ఆమె మనసు పరవశించింది 
చల్లగా వీచే చిరుగాలికి 
ఆమె మయూరమై నర్తించింది   
ఆమె అణువణువునా అలజడి 
ఆమె చూపుల్లో వలపు జడి 
ఆమె ఆధరాలపై చిరుజల్లు 
ఆమె చిరు నగవులో హరివిల్లు 
ఆమె ప్రతి కదలికలోనూ కోమలం 
మైమరపించే అందాల సౌందర్యం! 





Wednesday, 12 June 2013

ప్రేమ పావురాళ్ళు!





మంచు తెరలో దాగిన 
హిమబిందువులా ... 
నీలిమేఘాలలో వొదిగిన 
వాన చునుకులా ... 
కోవెల కొలనులో వెలసిన 
తామర పువ్వులా ... 
విరిసిన కుసుమంలో నిండిన 
మధుర్యంలా ... 
ప్రేమికుల మధ్య 
ఆప్యాయతానురాగాలు 
పరిమళించాలి! 
హృదయం నిండా 
అనురాగ కుసుమాలు 
గుభాళించాలి!!