”శోధిని”

Wednesday, 12 June 2013

ప్రేమ పావురాళ్ళు!





మంచు తెరలో దాగిన 
హిమబిందువులా ... 
నీలిమేఘాలలో వొదిగిన 
వాన చునుకులా ... 
కోవెల కొలనులో వెలసిన 
తామర పువ్వులా ... 
విరిసిన కుసుమంలో నిండిన 
మధుర్యంలా ... 
ప్రేమికుల మధ్య 
ఆప్యాయతానురాగాలు 
పరిమళించాలి! 
హృదయం నిండా 
అనురాగ కుసుమాలు 
గుభాళించాలి!! 


Monday, 10 June 2013

మిల్క్ బ్యూటీ!


తెలుగు చలనచిత్రరంగంలో రచ్చరచ్చ చేస్తూ...  తన తడాఖా చూపిస్తోంది మిల్క్ బ్యూటీ తమన్నా. తన  అందాలను  యధేశ్చగా ఆరబోస్తూ  బికినీ షోకు సై అంటోంది ఈ ముద్దుగుమ్మ. అదిరేటి డ్రస్ లతో  కుర్రకారు గుండెల్లో గుబురు పుట్టిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలందరి తోనూ నటించింది. ఇంత వరకు ఈ అమ్మడుతో నటించని హీరోలు ఆమేతో సినిమా చేయడానికి తహతహలాడుతున్నారు.  ప్రస్తుతం టాలీవుడ్ ను  ఒక ఊపు ఉపేస్తున్న  తమన్నా దీపం ఉండగానే ఇళ్ళు చక్కబెట్టుకుంటోంది. సమాజంతో పనిలేదు  డబ్బే ప్రదానమని ముందుకు వెళ్తోంది.  



Saturday, 8 June 2013

మనిషికి ఉండాలి నిబ్బరం... 
ఇతరుల ఎదుగుదల చూసి 
ఉండకూడదు కడుపుబ్బరం!


దేశం కోసం!

దేశాభివృద్ధి కోసం...  
శ్రామికుడు!
దేశ రక్షణ కోసం... 
సైనికుడు!! 
దేశాన్ని దోచుకోవడానికి... 
నాయకుడు!!! 
కష్టపడుతున్నారు. 


Wednesday, 5 June 2013

పర్యావరణాన్ని రక్షించు!


      మనిషి మహా స్వార్థపరుడు. ఏది ఏమైనా పర్వాలేదు,  బాగుంటే చాలు, నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకుంటే చాలు అనుకునే దుర్మార్గపు ఆలోచనతోనే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు.    ఫలితంగా గుండె నిండా గాలి పీల్చుకున్న ప్రతిసారీ మనం చెటికెడు కాలుష్యాన్ని ఊపిరితిత్తుల్లో నింపుకుంటున్నాము. మనవల్ల  పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతో అకాల వర్షాలు పంటలను మింగేస్తున్నాయి. మండే ఎండలు మనుషుల్ని మాడ్చేస్తున్నాయి.  కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి ప్రాణాలను తీస్తున్నాయి. ఋతుపవనాలు గతి తప్పుతున్నాయి.  దాంతో భూలోకం వేడెక్కుతోంది.  భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.  త్రాగేందుకు గుక్కెడు మంచి నీళ్ళు దొరకడం గగనం అయిపొయింది.  ఎంత జరుగుతున్నా మన పాలకులకు చేమ కుట్టినట్లయినా లేదు.  పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మనిషి ప్రకృతితో యుద్ధం చేయకూడదు.  కొండలను కొండలుగా ఉండనివ్వాలి. నదులను స్వేచ్చగా పారనివ్వాలి.  చెట్లను చేట్లుగానే బ్రతకనివ్వాలి.  మనసున్న ప్రతి ఒక్కరూ  పర్యావరణాన్ని కాపాడుకోవడానికి భాద్యతగా మందుకు రావాలి. అడవులు హరించి, జంతువులను మట్టుపెట్టి పచ్చదనాన్ని పొట్టన పెట్టుకుని, అన్నీ హరించి, అంతం అయ్యాక జీవకళ కనుమరుగవుతుంది.  ఇది  మానవజాతికే గొడ్డలి పెట్టు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడయినా  మనిషి మేల్కొనక పొతే రాబోయే  రోజుల్లో మనిషి మనుగడ అసాధ్యం. అందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హరిత ప్రకృతిని కాపాడుదాం.  



Tuesday, 4 June 2013

సౌందర్య లహరి!


ఉషోదయ వేళ మెరిసే 
తొలి కిరణంలా
సాయం సంధ్య వీచే  
చల్లని చిరుగాలిలా
బ్రాహ్మీ ముహూర్తాన వచ్చే 
అందమైన కలలా 
వెన్నెల్లొవికసించిన
మల్లెల పరిమళంలా 
సప్త వర్ణాలను నింపుకున్న 
హరివిల్లులా 
సప్త స్వరాలను పలికించే 
వేణుగానంలా 
మంచు తెరలో దాగిన 
హిమ బిందువులా 
నీ సౌందర్యం మనోహరం 
నీదరహాసం  ఆహ్లాదకరం! 



Monday, 3 June 2013

మన దేశంలో...

తిండి దొరక్క 
కోతిని ఆడించేవాళ్ళు  
కొంత మంది అయితే...  
తిన్నది అరక్క 
కోతి చేష్టలు చేసేవాళ్ళు 
చాలా మంది!