”శోధిని”

Wednesday, 5 June 2013

పర్యావరణాన్ని రక్షించు!


      మనిషి మహా స్వార్థపరుడు. ఏది ఏమైనా పర్వాలేదు,  బాగుంటే చాలు, నాలుగు తరాలకు సరిపడా సంపాదించుకుంటే చాలు అనుకునే దుర్మార్గపు ఆలోచనతోనే ప్రకృతిని నాశనం చేస్తున్నాడు.    ఫలితంగా గుండె నిండా గాలి పీల్చుకున్న ప్రతిసారీ మనం చెటికెడు కాలుష్యాన్ని ఊపిరితిత్తుల్లో నింపుకుంటున్నాము. మనవల్ల  పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతో అకాల వర్షాలు పంటలను మింగేస్తున్నాయి. మండే ఎండలు మనుషుల్ని మాడ్చేస్తున్నాయి.  కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి ప్రాణాలను తీస్తున్నాయి. ఋతుపవనాలు గతి తప్పుతున్నాయి.  దాంతో భూలోకం వేడెక్కుతోంది.  భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.  త్రాగేందుకు గుక్కెడు మంచి నీళ్ళు దొరకడం గగనం అయిపొయింది.  ఎంత జరుగుతున్నా మన పాలకులకు చేమ కుట్టినట్లయినా లేదు.  పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మనిషి ప్రకృతితో యుద్ధం చేయకూడదు.  కొండలను కొండలుగా ఉండనివ్వాలి. నదులను స్వేచ్చగా పారనివ్వాలి.  చెట్లను చేట్లుగానే బ్రతకనివ్వాలి.  మనసున్న ప్రతి ఒక్కరూ  పర్యావరణాన్ని కాపాడుకోవడానికి భాద్యతగా మందుకు రావాలి. అడవులు హరించి, జంతువులను మట్టుపెట్టి పచ్చదనాన్ని పొట్టన పెట్టుకుని, అన్నీ హరించి, అంతం అయ్యాక జీవకళ కనుమరుగవుతుంది.  ఇది  మానవజాతికే గొడ్డలి పెట్టు అన్న వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడయినా  మనిషి మేల్కొనక పొతే రాబోయే  రోజుల్లో మనిషి మనుగడ అసాధ్యం. అందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హరిత ప్రకృతిని కాపాడుదాం.  



Tuesday, 4 June 2013

సౌందర్య లహరి!


ఉషోదయ వేళ మెరిసే 
తొలి కిరణంలా
సాయం సంధ్య వీచే  
చల్లని చిరుగాలిలా
బ్రాహ్మీ ముహూర్తాన వచ్చే 
అందమైన కలలా 
వెన్నెల్లొవికసించిన
మల్లెల పరిమళంలా 
సప్త వర్ణాలను నింపుకున్న 
హరివిల్లులా 
సప్త స్వరాలను పలికించే 
వేణుగానంలా 
మంచు తెరలో దాగిన 
హిమ బిందువులా 
నీ సౌందర్యం మనోహరం 
నీదరహాసం  ఆహ్లాదకరం! 



Monday, 3 June 2013

మన దేశంలో...

తిండి దొరక్క 
కోతిని ఆడించేవాళ్ళు  
కొంత మంది అయితే...  
తిన్నది అరక్క 
కోతి చేష్టలు చేసేవాళ్ళు 
చాలా మంది!

పాపం... మూగజీవులు!

తరిగి పోతున్న అడవులు...  
తల్లడిల్లుతున్న అటవిజీవులు! 














పర్యావరణాన్ని కాపాడుదాం...    
ప్రాణ కోటిని రక్షిస్తాం!

Thursday, 30 May 2013

మన తెలుగోడు !

పక్కవాడి ఎదుగుదలను చూసి 
జీర్ణించుకోలేని వాడు... 
తనమాటే వినాలి అనే 
అహంభావం కలవాడు...  
ఏదోవిధంగా ఎదుటివారిని 
అవమాన పరచడానికో,
భాధించడానికో ప్రయత్నించేవాడే...  
మన తెలుగోడు ! 

Sunday, 26 May 2013

హాట్ హాట్ యాంకర్!

 
     గలగల నవ్వుతూ, సిగ్గులోలికిస్తూ, తుళ్ళుతూ మాట్లాడటం టీవి యాంకర్ల లక్షణం.  ఈ లక్షణాలన్నీ పుష్కలంగా వున్న కొత్త యాంకర్ అనసూయ.  అందుకే ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆడియో ఫంక్షన్లలోనూ, టీవి ఛానల్ లోనూ అనసూయ పేరు మారుమ్రోగుతోంది.  ఆమె హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె ధరించే దుస్తులలోనూ ప్రత్యేక  శ్రద్ద కనపరచడంతో  ప్రేక్షకుల మతులను పోగొడుతూ దూసుకు పోతోంది. ఇప్పుడామెకి మంచి డిమాండ్ ఏర్పడింది. హాట్ హాట్ గా యాంకరింగ్ చేస్తున్న అనసూయ స్పీడును చూసి ఇతర యాంకర్లు బిత్తరపోతున్నారు.  ఎప్పుడూ పాత ముఖాలేనా? కొత్తవారిని కుడా ప్రోత్స హిస్తామని ప్రేక్షకులు కుడా డిసైడ్ అయిపోయారు.  దాంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది అనసూయ. బెస్ట్ అఫ్ లక్  అనసూయ!



Saturday, 25 May 2013

మురిపాలు!

 
జింకపిల్లను చేరదీసి
ఓ మాతృమూర్తి ఔదారాన్ని
చాటుకుంటున్నారు. 
కంటికి రెప్పలా చూసుకుంటూ... 
తన బిడ్డతో సమానంగా
పెంచుకుంటూ ఆప్యాయంగా
జింక పిల్లకి పాలు త్రాగిస్తున్న దృశ్యం!