మనకో మంచి స్నేహితుడు కావాలంటే, ముందుగా మనం మంచి స్నేహితుడిగా మారాలి. మనం వారిని అర్థం చేసుకోగలిగితే స్నేహం చిరకాలం ఉంటుంది. స్నేహం కలకాలం సాగాలంటే చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధత అవసరం. మనసారా, మనస్పూర్తిగా స్నేహం చేసినప్పుడే ఆ స్నేహం మంచి పరిమళాలు వెదజల్లుతూ స్నేహ కుసుమాలను వికసింపజేస్తుంది. నిజమైన స్నేహితులు ఎన్ని గొడవలు జరిగినా,ఎన్ని ఆపదలు వచ్చినా మళ్ళీ కలిసిపోతారు . అలాంటివారు కలసి చివరిదాకా స్నేహితులుగా మిగిలిపొతారు. అవసరం కోసం వాడుకొనేవాడు నిజమైన స్నేహితుడు కాలేడు. అలాంటివాళ్ళు మనతో కొంత దూరమే పయనించి తర్వాత విడిపోతారు. స్నేహితుడంటే మన కోసం తన జీవితాన్ని త్యాగం చేయిగలిగే మనస్సు ఉంటె చాలు. కాని, ఈ లోకంలో ఎక్కడో వేలల్లో ఒకరు ఇలాంటి స్నేహితుడు ఉంటారు. అలాంటి మంచి స్నేహితుడు ఒక్కరు దొరికినా చాలు జీవితం ఆనందమయం అవుతుంది. ఇలాంటి స్నేహితుల్ని సంపాదించు కోగలిగిన వారు చాలా అదృష్టవంతులు.
నేడు మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలుగా మారి పోతున్నాయి ఆస్తిని పెంచుకుంటూ పరుల గురించి ఆలోచించడం మానేస్తున్నారు ఇంటి వైశ్యాల్యం పెంచుకొంటూ... హృదయ వైశ్యాల్యం తగ్గించుకుంటున్నారు కానరాదు ఎక్కడా మానవత్వం అణువణువునా క్రూరత్వం భోగభాగ్యాలు శాశ్వతం కాదని సమాజంతో సత్ సంబంధాలు ఇరుగు పొరుగు వారితో కలిసి ఉండటం మఖ్యమని ఈ హైటెక్ మానవుడు తెలుసుకునేదేప్పుడో!
రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో త్రాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. లక్షలాది మంది గుక్కెడు మంచి నీళ్ళ కోసం అల్లాడుతున్నారు. దానికి తోడూ విద్యుత్ కోతలు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ జిల్లాలలో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయాయి. ఈ పరిస్థితి కావడానికి కారకులు మన పాలకులే. ఓట్ల కోసం అన్నీ ఉచితాలు ఇస్తామని వాగ్ధానాలు చేసే రాజకీయ నేతలే. ప్రజలు త్రాగడానికి మంచి నీళ్ళు ఇవ్వలేని పాలకులు ఎన్నికలు రాగానే అన్నీ ఉచితం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. నీటి కోసం ప్రజలు పడే పాట్లు చూసి కుడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నీటిని నింపాల్సిన చెరువులు కజ్జాకు గురవుతుంటే చోద్యం చూస్తున్నారు. ఇష్ట మొచ్చినట్లు బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తుంటే పట్టించుకునే నాధుడే లేడు. ఫలితంగా నేడు భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఎప్పటి కైన పాలకులు, రాజకీయ నాయకులు మేల్కొని తక్షణమే నీటి సమస్య పైన దృష్టి పెట్టాలి.