”శోధిని”

Friday, 1 March 2013

నువ్వంటే ఇష్టం!




ఓపెన్ గా మాట్లాడుతూ 
నిజాయితీగా వుంటూ 
నిత్యనూతనంగా 
నా హృదిలో  
ప్రేమ దీపాన్ని వెలిగించావు 
నీ ఆప్యాయతానురాగాల్లో 
నన్ను ముంచావు 
నీ ప్రేమను శ్వాసిస్తూ
నీ ప్రేమ సాగరంలో 
ఓలలాడుతున్నాను 
అందుకే నవ్వంటే ఇష్టం 
నీ ప్రేమంటే మరీ ఇష్టం!  

 


Thursday, 28 February 2013

అపార్ట్ మెంట్ సంస్కృతి



ఫ్లాట్లేమో పెద్దగా
దగ్గరగా ఉంటాయి
అందులో నివసించే
మనుషులేమో
చాలా దూరంగా వుంటారు
మనిషిని మనిషి
దాటేసుకు పోతున్నా...
పలకరింపులు అసలు ఉండవు
అనుబందాలు, ఆత్మీయతలు
మచ్చుకైన కనిపించవు
ఆప్యాయతలు,అనురాగాలు
మనుషుల మధ్య కరువయ్యాయి
ఎవరి పనుల్లో వాళ్ళు ...
కలివిడిలేని హడావిడి
మనక్షేమం కోరేవారే
మనబంధువులని,
ఆప్యాయత కనబరచే వారే...
మన ఆత్మబంధువులని
తెలుసుకున్న నాడే
మసకబారిని మానవ సంబంధాలు
మళ్ళీ చిగురిస్తాయి.
వెన్నెలను పండిస్తాయి.






Monday, 25 February 2013

అర్థాంగి














నీ బాగు కోసం 
కర్పూరమై కరిగేది 
నీ పురోగతిని చూసి 
దివ్వెలా వెలిగేది 
నీ అర్థాంగి!
ప్రేమగా చూస్తే...  
అవుతుంది నీకు తల్లి 
వేధిస్తే ... 
అవుతుంది భద్రకాళి!! 

Saturday, 23 February 2013

నిఘా వైఫల్యం

నెత్తుటి దాహంతో
ఉగ్రవాదం...
భయం గుప్పిట్లో
ప్రజల ప్రాణం...
ప్రాణాలు తోడేస్తున్న
నిఘా వైఫల్యం!




ఐకమత్యం!


కాకుల్ని చూస్తే 
తెలుస్తుంది 
ఐకమత్యం 
అంటే ఏమిటో...!
చీమల్ని చూస్తే 
తెలుస్తుంది 
సమైఖ్యత 
అంటే ఏమిటో...!! 


Wednesday, 20 February 2013

నేటి పరిస్థితి!



ప్రశ్నించడం...  
మరచిపోయాం... 
నిలదీయడం...  
మానేశాం... 
ప్రతిదానికి...  
తలవంచడం... 
నేర్చుకున్నాం...  
అందుకే నాయకులు 
నిత్యం  మోసం 
చేస్తూనే ఉన్నారు 
ఇదీ నేటి పరిస్థితి! 


Sunday, 17 February 2013



వికసించిన పుస్పానివి నువ్వు ...
విరజిమ్మే పరిమళాన్ని నేను! 
విరిసే అనురాగం నువ్వు... 
కురిసే మమకారాన్ని నేను! 
మురిపించే రాగానివి నువ్వు... 
మైమరపించే భావాన్ని నేను! 
ప్రేమను పంచే ప్రాణానివి నువ్వు... 
అభిమానాన్ని పంచే అపురుపాన్ని నేను! 
అనురాగాల సన్నిధి నువ్వు...
ఆప్యాయతల పెన్నిధి నేను !
నీ ప్రేమ కోరుతుంది త్యాగాన్ని... 
నా ప్రేమ ఆశించదు ఏ ప్రతిఫలాన్ని!