మా ఆఫీసులో పనిచేసే వారంతా తెలుగువారే. కాని, తెలుగు మాట్లాడితే తమ హొదాకు భంగమనుకుంటారు. తెలుగు మాట్లాడేవారిని చూసి నవ్వుకుంటారు. తెలుగు పదాలను హేళన చేస్తుంటారు. పరభాషా వ్యామోహంలో పడి మన తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు. తెలుగు భాషలోని తియ్యదనం ఇలాంటివారికి ఎంత చెప్పినా చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లు అవుతుంది. కట్టు, బొట్టు తెలుగువారిదయినప్పుడు తెలుగులో మాట్లాడటం అవమానంగా భావించడం ఎందుకు? గొప్పలకుపోయి మాతృభాషను కించపరచడం ఎందుకు? ఇలాంటివారివల్ల తెలుగు సంస్కృతులు, ఆచారవ్యవహారాలు మాయమైపోతున్నాయి. మధురమైన తెలుగు భాషలోని పలుకులు తేనెలొలికే గులికలని, ప్రతి తెలుగుపదం వీనులవిందుగా, వినసొంపుగా ఉంటాయని మన తెలుగువాళ్ళు తెలుసుకొనే రోజు రావాలి.
Tuesday, 18 October 2011
Wednesday, 12 October 2011
ప్రజల భాధలు
సకల జనుల సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనులు పూర్తిగా స్తంభించి పోయాయి. నెల నుంచి విద్యాసంస్థలు తెరవకపోవడంతో విద్యార్థుల భవిషత్తుఫై తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమాజాన్నికలుషితం చేసే మద్యం షాపులు, సినిమాలను సమ్మెలో మినహాయించి విజ్ఞానాన్ని పంచే విద్యాసంస్థలను మూసివేయడం బాధాకరం. సమ్మె రోజురోజుకి ఉద్రుతరూపం దాల్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.పరిపాలనా వ్యవస్థ పూర్తిగా స్థమించి పోవడంతో అసలు ప్రభుత్వం అనేది వున్నదా అనే అనుమానం ప్రజలలో నెలకొంది. ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ఆటోడ్రైవర్లు విపరీతంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి అయినా ఉద్యమనేతలు స్పందించి విద్యార్థుల భవిషత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మె నుంచి విద్యాసంస్థలను మినహాయింపు ఇచ్చి ఆర్టీసి బస్సులను నడిపించి ఆటోడ్రైవర్ల బారినుంచి ప్రజలను కాపాడాలని మనవి.
Wednesday, 5 October 2011
మంచి మాటలు
"నిజం చెప్పేవాడికి పనితనం ఎక్కువ
అబద్దాలు చెప్పేవాడికి మాటలు ఎక్కువ"
* * * * * * * * * * * *
"కుడిచేత్తో నమస్కారం సంస్కారం
ఎడమచేత్తో నమస్కారం తిరస్కారం"
* * * * * * * * * * * *
* * * * * * * * * * * *
"పొదుపుగా వాడితే దొరుకుతుంది నీరు
దుబారా చేస్తే మిగిలేది కన్నీరు"
* * * * * * * * * * * *
"పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భవిత
పర్యావరణ రక్షణ మన భాధ్యత"
* * * * * * * * * * * *
Tuesday, 4 October 2011
Monday, 3 October 2011
Subscribe to:
Posts (Atom)




