Sunday, 26 July 2020
Tuesday, 21 July 2020
మంగళప్రదం శ్రావణమాసం !
శ్రావణ మాసంలో మంగళ, శుక్రవారాలలో అమ్మవారిని భక్తిశ్రద్దలతో నిండు మనసుతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రావణ మాసం మహిళలందరికీ మంగలప్రదమైనది...ఎంతో శుభదాయకమైనది. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది. వరలక్ష్మిదేవిని భక్తితో పూజించి, నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన వారింట అమ్మవారు కొలువై ఉంటుందని భక్తుల విశ్వాసం.
Saturday, 4 July 2020
గురు పౌర్ణమి శుభాకాంక్షలు!
ఉపాధ్యాయ వృత్తి ఏంతో గౌరప్రదమైనది. తల్లిదండ్రుల తర్వాత మనిషి వ్యక్తిత్వ వికాసంలో అధ్యాపకులదే కీలక పాత్ర. తనను తాను సంస్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించాలి కాబట్టి, ఏ మాత్రం నిర్లక్షంగా వ్యవహరించినా ఒక తరం తీవ్రంగా నష్టపోతుంది. అందుకే గురువులు భాద్యతగా వ్యవహరించాలి. విధినిర్వహణలో క్రమశిక్షణ, నిబద్దత ఖచ్చితంగా పాటించాలి. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకున్నారంటే అందులో ముఖ్యపాత్ర ఉపాధ్యాయులదే. విద్యార్థులు కుడా గురువులను గౌరవించినప్పుడే వారి ఆశయం నెరవేరుతుంది.
Saturday, 20 June 2020
ఆరోగ్యప్రదాయిని 'యోగ'
'యోగ' అనేది సర్వజనుల శరీర ఆరోగ్యానికి సంబందించినది. మనిషి ఒత్తడిని తగ్గించి, శరీరానికి, మనసుకు అవసరమైన ప్రశాంతతను అందించే సంజీవిని. ప్రకాశవంతమైన ప్రేమకాంతిని వెదజల్లి, వ్యక్తి చుట్టూ ప్రశాంతమైన, పరిపూర్ణమైన వాతావరణాన్ని కలిగించే అమృతవాహిని. అంతేకాకుండా అసూయ, ద్వేషం, భయం, శోకం, దుఃఖం వంటి మానసిక ఆందోళనలను తగ్గించి కుళ్ళు, కుతంత్రాలను దూరం చేసే సంపూర్ణ ఆరోగ్యప్రదాయిని. శరీరాన్ని తేలిక పరచి జీవనశైలిలో మంచి మార్పును తీసుకొచ్చి, అనేక రుగ్మతలకు పరిష్కారం చూపే గొప్ప సాధనం 'యోగ'.
Wednesday, 17 June 2020
Wednesday, 27 May 2020
Subscribe to:
Posts (Atom)







