అవినీతి అంటే కేవలం
లంచం తీసుకోవడమే కాదు. మన విధులను,
బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోవడం, విధులకు సమయానికి హాజరు కాకపోవడం, సమయానికన్నా
ముందే ఆఫీస్ నుండి వెళ్లి పోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం, విద్యుత్‌ను
అక్రమంగా వాడటం, బస్సులో, రైళ్లలో టికెట్ లేకుండా ప్రయా ణించడం, ఇంట్లోని మురికి
నీటిని రోడ్లమీదకు వదిలి వేయటం. ఇంట్లోని చెత్తను
మురికి కాలువలలో పడేయడం, రోడ్డును ఆక్రమించుకొని ఇంటిని నిర్మించుకోవడం, ఫంక్షన్‌ల పేరుతో
రోడ్లపైన టెంట్లు వేసి, రహదారిపై
రాకపోకలకు అంతరాయం కలిగించడం వంటివి కూడా
అవినీతిలో భాగాలేనని గుర్తించాలి.
Wednesday, 21 November 2018
Saturday, 17 November 2018
Sunday, 11 November 2018
శుభాలనొసగే కార్తీకం
గోరంత పూజకి కొండంత ప్రతిఫలం!
తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో
శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుంది భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో శివుడికి అభిషేకములు,
మారేడుదళాలు సమర్పించినా
శివ కటాక్షం లభిస్తుందంటారు. ఈ మాసంలో కార్తీక స్నానం,
తులసి పూజ,
శివకేశవుల స్తోత్ర
పారాయణం, పూర్ణిమ,
ఏకాదశులలో చేసే
శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
Saturday, 10 November 2018
కార్తీకదీపం... సకలపాపహరణం !
శివకేశవుల అనుగ్రహాన్ని
పొందడానికి అవకాశం కలిగించే పవిత్రమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో
విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. కార్తీకమాసంలో మనం పాటించే నియమాలే మనకు
భగవంతుని అనుగ్రహం దక్కేలా చేస్తూ ఉంటాయి. ఈ మాసంలో చేసే దైవారాధన, జపం, ఉపరాస దీక్షలు, దీపారాధనలు, దానధర్మాలు, అన్నదానం అన్నీ
కూడా అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాయని చెబుతారు. కార్తీకమాసంలో 'దీపం' ప్రత్యేకత
అందరికీ తెలిసిందే ! మహిళలు సమీప నదులలో దీపాలను వెలిగించి వదిలే దృశ్యం
ఎంతోరమ్యంగా,నేత్రపర్వంగా,హృదయానందకరంగా
ఉంటుంది.
Tuesday, 6 November 2018
Sunday, 4 November 2018
Sunday, 28 October 2018
అడుగడుగునా అవకాశవాదులే !
మంచికి పోతే చెడు మూటకట్టుకునే రోజులివి. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయాక మరొకలా అబద్దాలు ఆడటం వీరి నైజం. అందుకే ఇలాంటి అవకాశవాదులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండటం ఆలవాటు చేసుకోవడం ఉత్తమం.
Subscribe to:
Posts (Atom)






