నవమాసాలు మోసి కాన్పు కష్టమయ్యే సమయంలో అత్యవసర
పరిస్థితులలో మాత్రమే ఆపరేషన్ చేసి శిశువును బయటికి తీస్తారు. కాని. నేడు అలా జరగడం లేదు. నవమాసాలు నిండక ముందే నక్షత్రం. రాసి, ఘడియలు
చూసి బలవంతంగా అమ్మ కడుపును చీల్చి, బిడ్డను బయటికి తీస్తున్నారు. మూడనమ్మకాలతో ప్రజలు, డబ్బు కోసం వైద్యులు
ఇలాంటి ప్రసవాలను చేస్తున్నారు. ఇలాంటి
కాన్పులు అన్ని ఆసుపత్రులలో మాములయిపోయాయి. మూడనమ్మకాలతో తమకు నచ్చిన విధంగా బిడ్డ
ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి ప్రసవాలకు
పాల్పడుతున్నారు. సైన్స్ ఎంతగా అభివృద్ధి
చెందుతున్నా ముహుర్తాలని, గ్రహాలని,
మూడనమ్మకాలవైపు ప్రజలు పరుగెడుతూనే ఉన్నారు. మంచి నక్షత్రంలో పుడితే మహాజాతకుడు అవుతారనే
గుడ్డి నమ్మకం ప్రజలల్లో పోవాలి. సహజంగా
జరగాల్సిన ప్రసవాన్ని ముహూర్తం చూసి కాన్పులు చేయించడం మంచిది కాదు. గతంలో సహజంగా పుట్టినవారికి జాతకనక్షత్రం చూసేవారు. కానీ, నేడు ముందుగానే జాతక నక్షత్రాలు చూసుకుని
బిడ్డకు జన్మనివ్వడం విడ్డూరం. జనవరి 1న ఇలాంటి బలవంతపు కాన్పులు వేల సంఖ్యలో జరిగినట్టు
జరిగినట్టు తెలుస్తోంది.
Thursday, 4 January 2018
Wednesday, 27 December 2017
Sunday, 24 December 2017
కరుణామయుడి జన్మదిన శుభాకాంక్షలు
దైవత్వం మానవత్వంలోకి ప్రవేసించిన రోజు క్రిస్మస్. ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని ఏసుక్రీస్తు చెప్పాడు. ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఈలోకంలోకి లోకరక్షకుడిగా వచ్చినందుకు ఏసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుని ఆరాదిస్తారు. క్రిస్మస్ నాడు క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడుతూ, దేవుని వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. " నీపట్ల నీవు ఎలా ప్రవర్తించుకుంటారో ఇతరుల పట్ల అలాగే వ్యవహరించు... పోరుగువారిని నీలాగా భావించి ప్రేమించు..." ఇలాంటి వాక్యాలు కోకొల్లలు. మనం ఎదుటివారిని మనస్పూర్తిగా ప్రేమిస్తే ...మనల్ని కూడా అవతలి వాళ్ళు అంతే ఇష్టంగా ప్రేమిస్తారు. సాటి మనిషిని మనస్పూర్తిగా ప్రేమించమని ఏసు చెప్పాడు. స్వార్థపూరితమైన ప్రార్థనలు కాకుండా ఇతరుల సంతోషం కోసం, వారి సుఖసౌఖ్యాల కోసం ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు . నీతి, నిజాయితీగా ఉంటూ, మన మనసు పరిశుద్ధంగా వుంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. దాంతో సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదం, ఆశీస్సులు మనకు లభిస్తాయి.
Monday, 18 December 2017
Tuesday, 12 December 2017
Sunday, 10 December 2017
Subscribe to:
Posts (Atom)






