Sunday, 1 October 2017
Friday, 29 September 2017
ప్రకృతి స్వరూపిణి...ఆదిపరాశక్తి”
కోట్లానుకోట్ల జీవరాశులల్లో ఉండే జీవరూపశక్తి, సకల సృష్టికి కార్యకారణరూపిణి అయిన ఆదిపరాశక్తి...దుర్మార్గుల పై విజయఢంకా మోగించి, అఖిలలోకాలచేత కీర్తించబడే సర్వశక్తి స్వరూపిణి కనకదుర్గ. ప్రకృతి స్వరూపిణిగా వివిధ నామాలతో విరాజిల్లుతుంది. సర్వ సృష్టిని సస్యశ్యామలంగా చేసే తల్లి కనుక శాకంబరీదేవిగా కూడా పిలవబడుతూ, శరన్నవరాత్రులల్లో ఆదిపరాశక్తిని తొమ్మిది అవతారాల్లో పూజించి, పదవరోజు శివశక్తుల కలయికగా శ్రీరాజరాజేస్వరీదేవిని స్తుతిస్తాం. ఈ నవరాత్రులలో ఒక్కోరోజు ఒక్కొక్క అవతారములో ఆ తల్లి దర్శనమిస్తుంది. సృష్టిలోని ఆణువణువూ అమ్మ ప్రతిరూపమే. ఓంకారాన్ని సృష్టించిన శక్తే జగన్మాత. ఆమె సృష్టిలయకారిణి...జగదేకస్వరూపిని...సకలచరాచరణి. వీరత్వానికి ప్రతీకయినా దుర్గాదేవిని ఎన్ని విధాలుగా, ఎన్ని రూపాలుగా కీర్తించినా, అర్చించినా అవన్నీ ఆదిపరాశక్తి జగన్మాతకే చేరుతాయి. దసరా నవరాత్రులలో అమ్మవారు విభిన్న రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేక అలంకరణలతో ప్రకాశిస్తారు. పూలు, కుంకుమలతో అమ్మవారికి పూజలు చేస్తూ, సుఖసౌఖ్యాలు కలగజేయాలని భక్తులు కోరుకుంటారు. జగన్మాత దుర్గాదేవి మహిశాసురమర్దినిగా పూజలందుకుంటున్న వేళ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
కాయల నాగేంద్ర, హైదరాబాద్
Wednesday, 13 September 2017
Monday, 4 September 2017
ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు !
లక్షలాది మంది అధ్యాపకులకు ఆదర్శమూర్తి, మహాజ్ఞాన సంపన్నుడు, గొప్ప తత్వవేత్త డా.సర్వేపల్లి రాధాకృష్టన్ గారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి దేశ అధ్యక్ష పదవికి చేరుకున్న మహానుభావుడు. గురువులందరికీ ఆదర్శప్రాయుడయిన డా. సర్వేపల్లి గారి జన్మదినం నేడు. ఆయన పుట్టిన
రోజును ఉపాధ్యాయుల దినోత్సవంగా
జరుపుకుంటున్నాం. దేశంలో ఉపాధ్యాయుడికి ఉన్నత స్థానం ఉంది. గురువు లేని
విద్యార్థి మంచి మార్గాన ప్రయానించలేడు. ఉపాధ్యాయుడు అంటే
కేవలం విద్య చెప్పేవాడు మాత్రం కాదు...లోకజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించేవాడని అర్థం. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేకమైన
రోజుని ఏర్పాటుచేసి, ఆవృత్తిని గౌరవించడం మన సంస్కృతి గొప్పదనం. ఈ రోజున వారిని
సత్కరించాలి...వారి సేవలను గౌరవించాలి...వారి ఆదర్శాలను అనుసరించాలి. గురువులందరికీ అభినందనలు...శుభాకాంక్షలు!
Friday, 1 September 2017
భక్తికి, త్యాగానికి ప్రతీక 'బక్రీద్'
Monday, 28 August 2017
Subscribe to:
Posts (Atom)







