కొందరు ఆధునిక అవసరాల పేరుతో కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు. మరికొందరు ధన సంపాదనకోసం నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ అత్యంత దయనీయంగా, క్రూరంగా పెనువిద్వంసం సృష్టిస్తున్నారు. ఇంకొందరు నిర్ధాక్షణంగా చెట్లను నరికేస్తూ, వ్యర్ధాలను నలువైపులా వెదజల్లుతూ, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నారు. ఇలా సహజవనరులను హరించేస్తూ, జంతువులను, పక్షులను నాశనం చేస్తూ ప్రకృతి వినాశనానికి ఇదొక విధంగా కారణమవుతున్నారు. ఫలితంగా తుఫానులు, భూకంపాలు! మన కళ్ళను మనేమే పొడుచుకుంటూ... మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం. ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు రెక్కలు తెగిన పక్షుల్ల విలవిలాడుతున్నాయి. పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం... భూమిని భూమిలా ఉండనిద్దాం... చెట్లను చెట్లగా బ్రతకనిద్దాం... నదులను నదులుగానే పారనిద్దాం ... మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !
Saturday, 4 June 2016
Friday, 3 June 2016
Wednesday, 1 June 2016
Saturday, 28 May 2016
"నట సింహం"
"నందమూరి తారక రామారావు" ఈ పేరే ఒక సంచలనం... ఒక
ప్రభంజనం. ఆ పేరు మంచి మానవతల మేలు కలయిక. పట్టుదల, కార్యదీక్ష ఆయన
సొత్తు. తెలుగు వారికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పెట్టిన ఘనత
ఆయనకే దక్కుతుంది. ప్రేక్షకులే ఆరాధ్య దైవం అని భావించే నందమారి చేసిన
ప్రతి విన్యాసం జనబాహుళ్యాన్నిపొందింది. సినిమా రంగంలో ఆయన పాటించిన
క్రమ శిక్షణ ఎందరికో మార్గదర్శకం అయింది. నటుడిగా, దర్శకుడిగా,
ముఖ్యమంత్రిగా తెలుగుజాతి మన్నలను పొంది, సాంఘీక, జానపద,పౌరాణిక,
చారిత్రిక చిత్రాలలో నటించి, తెలుగు
సినీమానవ సరోవరంలో నిరంతరం విహరించిన నట సింహం నందమూరి తారక రామారావు.
తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస పరిమళ భరిత పారిజాతపుష్పం.
నమ్మిన వారిని ఆదరించడం, ఆత్మీయతను పంచడంలో ఆయనకు మరెవ్వరూ సాటిరారు.
1983 లో 'తెలుగుదేశం' పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలలోనే ముఖమంత్రి పీఠం
అధిష్టించి, తెలుగువారి ఆత్మాభిమానం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన
ఘనుడు... దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇందిరాగాంధినే 'డీ' కొని,
ఖండాంతరాలకు తెలుగు మాధుర్యాన్ని చవి చూపించిన యోధుడు. అటు
సినీరంగంలోనూ...ఇటు రాజకీయరంగంలోనూ తనదైన ముద్ర వేసిన రామారావుగారు
సామాన్యుడు కాదు...ఒక మహాశక్తి. ఎన్నో విశిష్టలున్న మహామనిషి. సినీరంగంలో
శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా, కర్ణుడుగా, దుర్యోధనునిగా, రావణాసురుడుగా ఆ
పాత్రలకు ఆయన ప్రాణం పోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్
చైర్మన్ గా, జాతీయస్థాయి నాయకుడిగా రామారావు గారు కీర్తి శిఖరం
అధిరోహించారు. మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగంను
ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని
సాధించారు.
మరపురాని మరువలేని మహా నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి (మే 28) సందర్భంగా....
Wednesday, 25 May 2016
పచ్చని కాపురాలలో చిచ్చు !
స్మార్ట్ ఫోన్, వాట్సఫ్, పేస్ బుక్ లాంటి సాధనాలను సరిగా వినియోగించకపోతే పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే ప్రమాదం ఉంది. వీటి ద్వారా పరిచయమైన కొందరు వ్యక్తులు పండంటి కాపురాల్లో కలతలు రేపుతున్నారు. దాంతో దంపతుల మధ్య అనుమానపు పొరలు పెరిగి, నిండు సంసారాలు పెటాకులు అవుతున్నాయి. ముఖ్యంగా కొత్త కాపురాలలో ఇలా జరుగుతుండటం విచారకరం. అందుకే పై సాధనాలు ఉపయోగించేటప్పుడు మిత్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
Sunday, 22 May 2016
మత్తెక్కించే మల్లెలు !
వేసవికాలం వచ్చిందంటే చాలు మల్లెపూలు తమ సుగంధాలతో పరిసరాలను నింపేస్తాయి. మనసును సమ్మోహన పరచి ఏదో లోకాలకు తీసుకెలతాయి. ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా సాయంకాలం అయ్యేసరికి మల్లెలను చూడగానే మనసంతా ఆహ్లాదం నిండి మోహనరాగం పలికిస్తుంది. మధురానుభూతో మది సన్నాయిగీతం ఆలపిస్తుంది. పరిమళానికి మారుపేరయిన పరిమళభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే!
అంతేకాదు మనసును రంజింపజేసే మల్లెల గుబాళింపు చల్లదనానికి, కమ్మదనానికి పెట్టింది పేరు.
Subscribe to:
Posts (Atom)