Sunday, 31 January 2016
Saturday, 30 January 2016
Friday, 29 January 2016
Thursday, 28 January 2016
Monday, 25 January 2016
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !
మనం రూపొందించుకున్న రాజ్యాంగం మనకు స్వాతంత్ర్యం వచ్చిన 2 1/2 ఏళ్ల తర్వాత 1950 జనవరి 26న అమలయింది. ఆ రోజునే మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మన దేశంలో ఉన్నన్ని మతాలు, జాతులు, భాషలు మరే దేశంలోనూ లేవు. మనమంతా అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తూ ప్రపంచంలో ఆదర్శంగా నిలిచాం. అన్ని కులాలను, మతాలను, ప్రాంతాలను సమానంగా గౌరవించుకోవడం మన రాజ్యాంగం ప్రత్యేకత. ఈ సందర్భంగా మనదేశానికి తమ జీవితాన్ని అర్పించిన ఎందరో మహనీయుల త్యాగఫలాన్ని స్మరించుకుందాం.
Friday, 22 January 2016
ఇదెక్కడి న్యాయం !
రోడ్డు పైన ఇద్దరు కొట్టుకుంటుంటే, మానవత్వం వున్న మనుషులు చూస్తూ ఊరుకోరు. వారిద్దరిని విడదీసి, సద్దిచెప్పి పంపిస్తారు. దెబ్బలు తగిలిన వారిని ఆసుపత్రిలో చేర్పిస్తారు. నేరం చేసిన వారిని పోలీసులకు పట్టిస్తారు. కాని, మూగజీవులైన కోడిపుంజులను పందాలకు పెట్టి, అవి రక్తం చిందేలా తన్నుకుంటుంటే, మానవత్వాన్ని మరచి వందలాదిమంది సంబరంతో కేకలు వేస్తూ...ఆనందంతో చిందులేస్తారు. మనుషులకొక న్యాయం, ముగజీవులకొక న్యాయమా? ఇదెక్కడి న్యాయం ?
Thursday, 21 January 2016
Subscribe to:
Posts (Atom)







