Saturday, 24 October 2015
Thursday, 22 October 2015
జమ్మిచెట్టు పైన పాలపిట్ట !
విజయదశమి పర్వదినాన పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా జమ్మి చెట్టును పూజించె సంప్రదాయం అనాదిగా వస్తోంది. జమ్మి చెట్టును పూజిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయంటారు. కాని, దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో పక్షులు కూడా అంతరించి పోతున్నాయి. మట్టి ప్రదేశాలన్నీ కాంక్రీట్ గా మారడంతో జమ్మి చెట్లు కనుమరుగయి పొతున్నాయి. ఇలాంటి సమయాలలో దసరా నాడు పాలపిట్ట చిత్రాన్ని చూసి సంతృప్తి చెందుదాం.
Wednesday, 21 October 2015
విజయదశమి శుభాకాంక్షలు !
పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. వివిధ సంస్కృతీ సంప్రదాయాలతో కలిసిన పండుగలు సంప్రదాయశోభను ద్విగుణీకృతం చేస్తూ మానసికమైన ఆనందాన్ని, తృప్తిని ఇస్తాయి. అందుకే ప్రతి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. ముఖ్యంగా దసరా పండుగ ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజులు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తారు. చివరి రోజు మహిషాసురుడిని సంహరించడంతో 'సమాజంలోని దుర్మార్గం నశించి మంచి మానవత్వం పెరగాలని కోరుకుంటూ' పదవరోజు విజయదశమి పండుగను జరుపుకోవడం ఆనవాయితి. విజయదశమి నాడు దుర్గాదేవిని ఆరాదిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల విశ్వాసం. ఈ రోజున ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండివంటలు, ప్రతి గుమ్మానికి బంతిపూలు, మామిడాకుల తోరణాలతో కళకళ లాడటం దసరా పండుగ ప్రత్యేకత. విజయదశమి పర్వదినం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖశాంతులు ప్రసాదించాలని దుర్గాదేవిని మనసారా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.
Monday, 19 October 2015
Sunday, 18 October 2015
శ్రీ లలితా పరమేశ్వరి !
విలాసం, ఔదార్యం, గాంభీరం, మాధుర్యం, తేజస్సు, సౌకుమార్యం కలిసిన స్త్రీ మూర్తి శ్రీ లలితా త్రిపుర సుందరి. లాలిత్యం, కారుణ్యం, అనురాగం, ఆత్మీయత ఆమె స్వభావాలు. పేరులోనే లాలిత్యం ఉన్న లలితా పరమేశ్వరి, ప్రాణ కోటికి అండగా నిలిచిన జగన్మాత. స్త్రీని దేవతగా పూజించే మనం... మనకు జన్మనిచ్చిన మహిళలకు తగిన గౌరవ మర్యాదలు ఇస్తూ... మంచి ప్రవర్తన కలిగి ఉంటే , జగన్మాతను అర్చించినంత ఫలితం దక్కుతుంది.
Wednesday, 14 October 2015
Monday, 12 October 2015
Subscribe to:
Posts (Atom)






