”శోధిని”

Saturday, 26 September 2015

వీధి కుక్కల బెడద !



గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ వున్న నగర శివారు ప్రాంతాలలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది.  ప్రదానంగా కాలనీలలో   వీధి కుక్కల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.  ఎక్కడ చూసినా గుంపులుగా సంచరిస్తూ, వింత అరుపులతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  వీటి కాటుకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.  ప్రతి రోజు ఏదొక చోట కుక్క కాటుకు గురయిన వార్తలే వినిపిస్తున్నాయి.  అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కుక్కల నియంత్రన కోసం చర్యలు తీసుకున్నట్టు కనబడటం లేదు.  ఇప్పటికైనా   అధికారులు మేల్కొని కుక్కల నియంత్రణకు తగు చర్యలు చేపడితే బాగుంటుంది.



Thursday, 17 September 2015

ఓల్డ్ ఈజ్ గోల్డ్ !




గతంలో పెళ్లిళ్లు  కొబ్బరాకు,  నేరేడాకులు, మామిడాకులు  పందిరి కింద మనోహరంగా జరిగేవి.  అతిధులు పచ్చని ఆకులు సువాసనలను ఆస్వాదిస్తూ...చక్కటి అనుభూతిని పొందేవారు.  ఇప్పుడు వాటి స్థానాన్ని షామియానాలు ఆక్రమించుకోవడంతో అ  అనుభూతిని కోల్పోతున్నాం.  పెళ్లి  భోజనం కుడా అరిటాకుల్లో  సాంప్రదాయకరమైన వంటల్ని ఆరగించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ ఇస్తరాకులు, బఫే పేరిట ఆరోగ్యాన్ని పాడుచేసే రకరకాల వంటకాలు.... అందుకేనేమో  'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నారు పెద్దలు.

Wednesday, 16 September 2015

వినాయకచవితి శుభాకాంక్షలు !


స్థితిపతి ...నిధిపతి ...అధిపతి
సర్వ విఘ్నములను తొలగించే... 
సిద్ది వినాయకుడు !
అక్షర గణపతి...యోగ గణపతి...ఆనంద గణపతి
సత్వర శుభాలను ప్రసాదించే... 
 శుభంకరుడు విఘ్నేశ్వరుడు  !!


దారి చూపేవాడు !










Monday, 14 September 2015

చిన్న విగ్రహాలను ప్రతిష్టించు ...పర్యావరణాన్ని కాపాడు !


వినాయకుడిని పూజించడానికి పెద్ద  విగ్రహాలు  ప్రతిష్టించాల్సిన  అవసరం లేదు.  విగ్రహం ముప్పయ్ అంగుళాలు ఉంటే చాలు.  పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు వాడని చిన్న మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తే బాగుంటుంది.  గణేష్ విగ్రహాలు పోటిపడి భారీ స్థాయిలో ప్రతిష్టించి, మైకులు, డి.టి.ఎస్  సౌండ్లతో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించగుండా తగుజాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది. మండపాన్ని అలంకరించే సీరియో బల్బులు, ఫ్లడ్ లైట్స్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. కాని, వాటికి ఉపయోగించే కరెంటు మాత్రం పబ్లిక్ గా విద్యుత్ చౌర్యం చేయకుండా  విద్యుత్ అధికారులను సంప్రదించి,  తగిన పైకం చెల్లించి విద్యుత్ ను వాడుకుంటే బాగుంటుంది.  విద్యుత్ అధికారులు  సూచించిన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. ఇంట్లో  ప్రతిష్టించే వినాయక విగ్రహాలను రసాయనాలను ఉపయోగించనివిగా, సాధ్యమైనంతవరకు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి.  మట్టి విగ్రహాలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించితే చూడముచ్చటగా ఉంటాయి.  పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు ఉపయోగించని విగ్రహాలను ప్రతిష్టించి  జలాశయాలను  కలుషితం కాకుండా, అందులోని జల పుష్పాలకు హాని కలుగకుండా  చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.