Monday, 21 September 2015
Saturday, 19 September 2015
Thursday, 17 September 2015
ఓల్డ్ ఈజ్ గోల్డ్ !
గతంలో పెళ్లిళ్లు కొబ్బరాకు, నేరేడాకులు, మామిడాకులు పందిరి కింద మనోహరంగా జరిగేవి. అతిధులు పచ్చని ఆకులు సువాసనలను ఆస్వాదిస్తూ...చక్కటి అనుభూతిని పొందేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని షామియానాలు ఆక్రమించుకోవడంతో అ అనుభూతిని కోల్పోతున్నాం. పెళ్లి భోజనం కుడా అరిటాకుల్లో సాంప్రదాయకరమైన వంటల్ని ఆరగించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ ఇస్తరాకులు, బఫే పేరిట ఆరోగ్యాన్ని పాడుచేసే రకరకాల వంటకాలు.... అందుకేనేమో 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నారు పెద్దలు.
Wednesday, 16 September 2015
Monday, 14 September 2015
చిన్న విగ్రహాలను ప్రతిష్టించు ...పర్యావరణాన్ని కాపాడు !
వినాయకుడిని పూజించడానికి పెద్ద విగ్రహాలు ప్రతిష్టించాల్సిన అవసరం లేదు. విగ్రహం ముప్పయ్ అంగుళాలు ఉంటే చాలు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు వాడని చిన్న మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తే బాగుంటుంది. గణేష్ విగ్రహాలు పోటిపడి భారీ స్థాయిలో ప్రతిష్టించి, మైకులు, డి.టి.ఎస్ సౌండ్లతో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించగుండా తగుజాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది. మండపాన్ని అలంకరించే సీరియో బల్బులు, ఫ్లడ్ లైట్స్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. కాని, వాటికి ఉపయోగించే కరెంటు మాత్రం పబ్లిక్ గా విద్యుత్ చౌర్యం చేయకుండా విద్యుత్ అధికారులను సంప్రదించి, తగిన పైకం చెల్లించి విద్యుత్ ను వాడుకుంటే బాగుంటుంది. విద్యుత్ అధికారులు సూచించిన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. ఇంట్లో ప్రతిష్టించే వినాయక విగ్రహాలను రసాయనాలను ఉపయోగించనివిగా, సాధ్యమైనంతవరకు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. మట్టి విగ్రహాలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించితే చూడముచ్చటగా ఉంటాయి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు ఉపయోగించని విగ్రహాలను ప్రతిష్టించి జలాశయాలను కలుషితం కాకుండా, అందులోని జల పుష్పాలకు హాని కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
Sunday, 13 September 2015
మన తెలుగు టీవీ ఛానల్స్ !
ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ చూస్తుంటే...అసలు మనుషుల మధ్య సత్సంబంధాలు, కుటుంబసభ్యుల మధ్య అభిమానాలు ఉండావా ? ప్రపంచమంతా మెచ్చుకునే మన కుటుంబ వ్యవస్థ విలువలేమయ్యాయి ? అనే సందేహం కలగకమానదు. ఎందుకంటే మన తెలుగు టీవీ సీరియల్స్ లో మగాడికి రెండు పెళ్లిళ్లు, వివాహేతర సంబంధాలు, అత్తాకోడళ్ళు, తోడికోడళ్ళ మధ్య పోరు, పగలు, ప్రతీకారాలు. డానికి తోడు కుట్రలు కుతంత్రాలు...మంత్రం తంత్రాలు.
చిన్న పిల్లల చేత పిచ్చి డ్యాన్స్ లు, అసభ్యకరమైన దుస్తులు వేయించడం. హాస్య కార్యక్రమం పేరుతొ మగవాళ్ళు ఆడవేషాలు వేస్తూ, ద్వంద అర్థాలతో కూడిన డైలాగులతో హాస్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒకరునొకరు కొట్టుకోవడం, జడ్జీలు విరగపడి నవ్వడం... ఇవ్వన్నీ చూస్తుంటే మనకు పిచ్చి ఎక్కడం ఖాయం.
Subscribe to:
Posts (Atom)






