Friday, 14 August 2015
Wednesday, 12 August 2015
Tuesday, 11 August 2015
Monday, 10 August 2015
'' గర్వం"
కులమత గర్వం కొందరిది
ధన అహంకారం మరికొందరిది
ఒకరు ముందు, మరొకరు వెనుక
అందరూ ఏదోకరోజు
మట్టిలో కలిసిపోయే వాళ్ళమే !
ఎందుకీ కులమత ధనఅహంకారాలు ?
కులమతాలు చూడకుండా
చెట్లు అందరికీ నీడనిస్తున్నాయి
నదులు దాహార్తిని తీరుస్తున్నాయి
మన నుండి ఏదీ ఆశించని గోమాతలు
అమృతతుల్యమైన క్షీరాన్ని అందిస్తున్నాయి
మనం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు
అన్నీ ప్రకృతి అందిస్తున్న సేవలే !
పంచభూతాలకు లేని ఈ వ్యత్యాసాలు
మధ్యలోపోయే మనుష్యులకెందుకో !
Friday, 7 August 2015
నక్కజిత్తులు !
లోకం ముందు నక్కజిత్తులు
ఎన్నివేశాలు వేసినా ..
ఎప్పుడో ఒకప్పుడు
వారి బండారం బయటపడుతుంది
వ్యక్తుల గుండెల్లో
నిజాయితీ ఉంటే ...
ఆలస్యంగా నైనా
వాళ్ల వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది.
నమ్మబలకడం
అవకాశవాదుల నైజం !
మోసపోవడం
అమాయకుల తత్వం !!
ఎన్నివేశాలు వేసినా ..
ఎప్పుడో ఒకప్పుడు
వారి బండారం బయటపడుతుంది
వ్యక్తుల గుండెల్లో
నిజాయితీ ఉంటే ...
ఆలస్యంగా నైనా
వాళ్ల వ్యక్తిత్వం ఆకట్టుకుంటుంది.
నమ్మబలకడం
అవకాశవాదుల నైజం !
మోసపోవడం
అమాయకుల తత్వం !!
Tuesday, 4 August 2015
అంతా... రాజకీయమే !
చట్టసభల సమావేశాలు జరుగుతున్న తీరు తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ప్రతిపక్షాలు సభలు జరగకుండా చేయడం, అధికార పక్షం దానికి ధీటుగా వ్యవహరించడంతో చట్టసభల సమావేశాల సమయం హరించుకుపోతోంది.
ప్రజల సమస్యల పైన చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాలను అన్వేషించవలసిన చట్టసభలు నేతల పరస్పర ఆరోపణలకు వేదికగా ఉపయోగించుకోవడం
వల్ల ఎంతో విలువైన ప్రజాధనం వృధా అవుతోంది. ప్రజాస్వామ్య వాదులకు
ఉండవలసిన సహనం, సంయమనం ఇటు అధికార పక్షంలోనూ, అటు ప్రతిపక్షం లోనూ
లోపించడం ప్రజల దురదృష్టకరం. ప్రజాసమస్యలను చర్చించకుండా, కళింకిత మంత్రుల రాజీనామా కోసం సభల ప్రతిస్థంభనకు గురికావడం బాధాకరం. తప్పుచేసినవాళ్లు నిజాయితిగా తప్పుకుంటే విలువ వుంటుంది. మేము తప్పుచేయలేదు దేవుడో చర్చలకు మేం సిద్దం అని మంత్రులు అంటుంటే, సభలో చర్చించకుండా రాజీనామా కోసం పట్టుపట్టి సభలను జరనీయకుండా చేయడం.... ఈ రాజకీయాలేమిటో... ప్రజలకు అర్థం కావడం లేదు.
Saturday, 1 August 2015
Subscribe to:
Posts (Atom)






