”శోధిని”

Wednesday, 27 May 2015

యుగపురుషుడు !

     
        కృషి, పట్టుదల, క్రమశిక్షణ, మంచి నడవడికతో... అంకితభావంతో తెలుగు చలనచిత్ర రంగంలో మహోన్నత స్థాయికి చేరుకొని తెలుగు ప్రజల మన్నలను పొందిన గొప్ప నటుడు స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు గారు.  మాటలో మంచితనం, భావనలో వివేకం, సాధనలో పట్టుదల, నటనలో విలీనం రామారావు గారికున్న ముఖ్య లక్షణాలు. సంపూర్ణమైన వ్యకిత్వానికి ఆయన చక్కని నిదర్శనం. 
తెలుగు చలన చిత్రరంగంలో ఎన్నెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి, తనకు          సాటిరారని నిరూపించిన ఎన్టీఆర్ సినీ అభిమానుల హృదయాలలో శ్వత స్థానంసంపాదించుకున్నారు...తెలుగు సినీరంగంలో అగ్రస్థానం   అధిష్టించారు. ఏ పాత్ర పోషించనా ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. చారిత్రాత్మకం, జానపదం, పౌరాణికం, సాంఘీకం ఇలా ఆయని చేయని పాత్రంటూ లేవు. ప్రతి పాత్రలో లీనమై తెలుగువారి హృదయాలలో జీవించి ఉన్నారు .  తెలుగువాడి బింకం, తెలుగువారి మమకారం, తెలుగువాడి మాటతీరు, పద్దతి అంతా ఆయన దివ్యమైన రూపంలో కనిపిస్తుంది. వ్యక్తిగా ఆయన సమున్నతుడు...  వ్యక్తిత్వంలో మహోన్నతుడు.                      
ఇక రాజకీయాల విషయానికొస్తే ...అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కంచుకోటగా ఉంటూ తనకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించన ఘనత ఎన్టీఅర్ గారిది.ఆయన ముఖ్యమంత్రిగా ఒన్న సమయంలోపార్లమెంటులో పెద్ద పార్టీలయిన బిజెపి, సిపిఐ, సిపియంల కంటే ఎక్కువ స్థానాలు 35 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని పార్లమెంటులో ఒక ప్రాంతీయ పార్టీ మొదటి సారిగా ప్రదాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది.  ఇది తెలుగువారందరికీ గర్వకారణం.

         ఎన్టీఅర్ జన్మదిన సందర్భంగా ....


Monday, 25 May 2015

ఇది స్వార్థం కాదా ?

అమ్మాయిలు నలుపు అయినా మంచి మనసు ఉంటే చాలు.  తెల్లటి అమ్మాయిలలో  మంచి మనసు  లేకపొతే జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది.  అందుకే అబ్బాయిలూ...కాబోయే భార్య రంగు ఏదైనా వెన్నలాంటి మంచి మనసును  చూడండి.  కేవలం రంగు చూసి మోసపోకండి.  మీరు నలుపు అయినా తెల్లటి అమ్మాయి భార్య కావాలనుకోవడం  స్వార్థం కాదా ?  మీలాగే అమ్మాయిలు కూడా తెల్లటి అబ్బాయిలనే తన జీవిత భాగస్వామిగా కావాలనుకుంటే  చాలా మంది అబ్బాయిలు పెళ్ళికాని ప్రసాదులుగా మిగిలిపోతారు.  కాని, అమ్మాయిలు అలా రంగు గురించి ఆలోచించడం లేదు.  హృదయం నిండా మంచితనం, మానవత్వం నింపుకుని అబ్బాయిల రంగు ఎదైనా తల వంచి తాళి కట్టించు కుంటున్నారు... అదీ వాళ్ళ గొప్పతనం!

Saturday, 23 May 2015

చిన్నారి నవ్వులు !

చిన్నారి  నవ్వులు 
సిరిమల్లె పువ్వులు 
ఏ కల్మషం లేని 
సన్నజాజి పువ్వులు 
కల్లాకపటం లేని 
స్వాతి ముత్యపు జల్లులు 
రేపటి భవితకు హరివిల్లులు!


Thursday, 21 May 2015

ప్రేమ మధురిమలు !

హాయిగా వీచే పైరు గాలిలా ...
చల్లగా కురిసే తొలకరి జల్లులా ...
ఆహ్లాదాన్ని పంచె పండు వెన్నెలా...
గుబాళించే మల్లెల పరిమళంలా ...
స్నేహ పుష్పాలను పూయించు 
ప్రేమ మధురిమలను అందించు !

Saturday, 16 May 2015

దైవ స్వరూపులు !

జన్మ నిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు దైవ స్వరూపులు.  వారికి సర్వతా కృతజ్ఞతా భావంతో ఉండాలి.  వృధ్యాప్యంలో తమ సంతానం పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా చిన్న చూపు చూస్తున్నారని చాలా మంది అనాధ వృద్ధ శరణాలయాలలో  కుంగి పోతుంటారు.  అయితే సంస్కారవంతులు ఎవరైనా తల్లిదండ్రులను చిన్న చూపు చూడరు.  సంస్కారహీనులయితేనే కన్నవారిని ఇబ్బందికి గురిచేస్తారు.  త్యాగానికి ప్రతిరూపాలు అమ్మ, నాన్నలు.  వృధ్యాప్యంలో వారికి అండగా నిలబడాలి.  భాద్యత నుండి తప్పుకోకుండా కన్నవారిని కన్న బిడ్డల్లా చూసుకోవాలి.  అందుకు వారిని నిత్యం పూజించాలి... అభిమానించాలి... ఆదరించాలి.  అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం.

Wednesday, 13 May 2015

ప్రకృతిలా జీవించు !

 

స్వచ్చంగ, నిర్మలంగా ఎటువంటి కల్మషం లేకుండా ప్రకృతి ఎంతో హాయిగా ఉంటుంది.  ప్రకృతిలోని అపురూప దృశ్యాలు  కనువిందు చేస్తాయి.  మనసంతా ఆహ్లాదాన్ని నింపుతాయి.  ప్రకృతి ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు అందులో భాగమైన మానవులు  నిర్మలంగా ఉండలేక పోవడానికి కారణం... కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థం, వంచన మోసంతోనే చాలా మంది జీవనం సాగిస్తున్నారు కాబట్టి.   అందుకేనేమో మానవులు ప్రకృతి లా ఉండలేక పోతున్నారనుకుంటా.