”శోధిని”

Monday, 25 May 2015

ఇది స్వార్థం కాదా ?

అమ్మాయిలు నలుపు అయినా మంచి మనసు ఉంటే చాలు.  తెల్లటి అమ్మాయిలలో  మంచి మనసు  లేకపొతే జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది.  అందుకే అబ్బాయిలూ...కాబోయే భార్య రంగు ఏదైనా వెన్నలాంటి మంచి మనసును  చూడండి.  కేవలం రంగు చూసి మోసపోకండి.  మీరు నలుపు అయినా తెల్లటి అమ్మాయి భార్య కావాలనుకోవడం  స్వార్థం కాదా ?  మీలాగే అమ్మాయిలు కూడా తెల్లటి అబ్బాయిలనే తన జీవిత భాగస్వామిగా కావాలనుకుంటే  చాలా మంది అబ్బాయిలు పెళ్ళికాని ప్రసాదులుగా మిగిలిపోతారు.  కాని, అమ్మాయిలు అలా రంగు గురించి ఆలోచించడం లేదు.  హృదయం నిండా మంచితనం, మానవత్వం నింపుకుని అబ్బాయిల రంగు ఎదైనా తల వంచి తాళి కట్టించు కుంటున్నారు... అదీ వాళ్ళ గొప్పతనం!

Saturday, 23 May 2015

చిన్నారి నవ్వులు !

చిన్నారి  నవ్వులు 
సిరిమల్లె పువ్వులు 
ఏ కల్మషం లేని 
సన్నజాజి పువ్వులు 
కల్లాకపటం లేని 
స్వాతి ముత్యపు జల్లులు 
రేపటి భవితకు హరివిల్లులు!


Thursday, 21 May 2015

ప్రేమ మధురిమలు !

హాయిగా వీచే పైరు గాలిలా ...
చల్లగా కురిసే తొలకరి జల్లులా ...
ఆహ్లాదాన్ని పంచె పండు వెన్నెలా...
గుబాళించే మల్లెల పరిమళంలా ...
స్నేహ పుష్పాలను పూయించు 
ప్రేమ మధురిమలను అందించు !

Saturday, 16 May 2015

దైవ స్వరూపులు !

జన్మ నిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తు దైవ స్వరూపులు.  వారికి సర్వతా కృతజ్ఞతా భావంతో ఉండాలి.  వృధ్యాప్యంలో తమ సంతానం పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా చిన్న చూపు చూస్తున్నారని చాలా మంది అనాధ వృద్ధ శరణాలయాలలో  కుంగి పోతుంటారు.  అయితే సంస్కారవంతులు ఎవరైనా తల్లిదండ్రులను చిన్న చూపు చూడరు.  సంస్కారహీనులయితేనే కన్నవారిని ఇబ్బందికి గురిచేస్తారు.  త్యాగానికి ప్రతిరూపాలు అమ్మ, నాన్నలు.  వృధ్యాప్యంలో వారికి అండగా నిలబడాలి.  భాద్యత నుండి తప్పుకోకుండా కన్నవారిని కన్న బిడ్డల్లా చూసుకోవాలి.  అందుకు వారిని నిత్యం పూజించాలి... అభిమానించాలి... ఆదరించాలి.  అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం.

Wednesday, 13 May 2015

ప్రకృతిలా జీవించు !

 

స్వచ్చంగ, నిర్మలంగా ఎటువంటి కల్మషం లేకుండా ప్రకృతి ఎంతో హాయిగా ఉంటుంది.  ప్రకృతిలోని అపురూప దృశ్యాలు  కనువిందు చేస్తాయి.  మనసంతా ఆహ్లాదాన్ని నింపుతాయి.  ప్రకృతి ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు అందులో భాగమైన మానవులు  నిర్మలంగా ఉండలేక పోవడానికి కారణం... కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థం, వంచన మోసంతోనే చాలా మంది జీవనం సాగిస్తున్నారు కాబట్టి.   అందుకేనేమో మానవులు ప్రకృతి లా ఉండలేక పోతున్నారనుకుంటా.

Tuesday, 12 May 2015

తన దాక వస్తే ...(ప్రాణం పైన తీపి )

పేషెంట్ ను చూస్తుండగా డాక్టర్ గారికి గుండెపోటు వచ్చింది.
డాక్టర్ : "నర్స్ ..వెంటనే 108 కి ఫోన్ చేసి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళు "
నర్స్ : "అదేమిటి డాక్టర్ మన ఆసుపత్రి ఉండగా ... ఇంకో ఆసుపత్రికి ఎందుకు ?"
డాక్టర్ : గుండెపోటుతో మన ఆసుపత్రి లో చేరిన వాళ్ళు ఇప్పటి వరకు బతికి బయట పడలేదు కదమ్మా" అసలు విషయం చెప్పాడు డాక్టర్.