Monday, 9 March 2015
Saturday, 7 March 2015
మహిళలను గౌరవిద్దాం ..ఆడపిల్లలను బ్రతకనిద్దాం !
సమాజంలో స్త్రీల వదనం పైనఎప్పుడూ చిరునవ్వులు విరబూయాలంటే...జన్మనిచ్చిన మహిళలను దేవతగా చూడాలి. సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు పురుషులతో సమానంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలి. తల్లిదండ్రులుచిన్నతనం నుంచి మగపిల్లలలో సంస్కారబీజాలను నాటాలి. మనకు చట్టాలు ఎన్నో ఉన్నాయి. కానీ, వాటిని అమలు పరచడంలో అధికారుల లోపం కనబడడంతో నిత్యం మహిళలపై అకృత్యాలు జరుగుతున్నాయి. మన పాలకులు చెబుతున్నవి ఆచరణలో జరగడం లేదు. ఇప్పటికైనా మహిళలకు మరింత భద్రత కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వాల పైన ఉంది. కేవలం మహిళా దినోత్సవం రోజునే మహిళలపట్ల గౌరవం పాటిస్తే సరిపోదు. నిత్యం
మహిళల హక్కులు, వారి భద్రత, వారిని గౌరవించడం, స్వేచ్చ పైన చర్చలు జరుగుతూ
ఉండాలి. అలా జరిగినప్పుడు ప్రతిరోజూ మహిళా దినోత్సవమే అవుతుంది.
Thursday, 5 March 2015
వసంతోత్సవం !
అందరికీ హోలీ శుభాకాంక్షలు!
Saturday, 28 February 2015
Friday, 27 February 2015
ప్రేమరాగం !
shark emoticon సాహితీ సేవ సమూహం నిర్వహించిన చిత్ర కవితల పోటీ -13 లో ' ప్రేమ ' అంశంపై ' ప్రేమ రాగం ' .. అనే శీర్షికతో కవిత రాసి" ప్రత్యేక బహుమతి" గెలుచుకొని విజేతగా నిలచిన కవి శ్రీ కాయల నాగేంద్ర గారికి అభినందనలు.
_________________/\_______________
shark emoticon కవి శ్రీ కాయల నాగేంద్ర గారి కలం నుండి జాలు వారిన కవితా కుసుమం.
☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼ :-:☼
heart emoticon ప్రేమ రాగం ..
ప్రేమ ...
అనుబంధం పూసిన పుష్పయాగం
అనురాగం ఎగిసిన సుగంధ పరిమళం
సర్వమానవాళి శ్రేయస్సు కాంక్షించే శోభాయమానం
ఆ పేరు వింటేనే మధురం... ఆ పలుకు మధురాతి మధురం
ప్రేమంటే ...
ఒక పులకింత... ఓ కలవరింత !
కులం, మతం, వయసు అనే సరిహద్దులు లేని గమ్యం
ఓటమి ఎరుగని మలయ మారుతం
ఏదో ఒక క్షణాన ప్రతి జీవిలోనూ చిగురించే
ఓ దివ్యమైన అనుభూతి !
దేవుడు మానవులకిచ్చిన అపురూప కానుక ప్రేమ
దానికి త్యాగం తప్ప మోసం, వంచన తెలియని
స్వచ్చమైన స్వాతిముత్యం !
ఈ ప్రేమ బంధానికి నమ్మకం పునాది
ఆ నమ్మకం కలకాలం నిలవాలంటే...
హృదయవీణపై ప్రేమరాగం
నిరంతరం మోగుతూ ఉండాలి !
గుండెల్లో నాదమై...
కళ్ళల్లో వెలుగుదీపమై...
అణువణువునా ప్రాణమై...
నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలి !
- కాయల నాగేంద్ర
మన తెలుగు తల్లికి మల్లెపూదండ !
ఆత్మగౌరవాన్ని ప్రసాదించే మాతృభాషను అభిమానించడం ప్రతి ఒక్కరి భాద్యత. అమ్మ భాషను గౌరవిస్తే ఆత్మ గౌరవం పెరుగుతుంది. దాంతో భాషకి పటుత్వం పెరుగుతుంది. భాష ప్రాముఖ్యతను గుర్తించినప్పుడే ఆ భాషకి ఖ్యాతి పెరుగుతుంది. ఐ జాతి అయితే మాతృభాషను కీర్తిస్తుందో ఆ జాతి మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే మనందరం మన మాతృభాషలో మాట్లాడుకుందాం! తెలుగు భాష ఔనత్యాన్ని పెంచుదాం!!
Subscribe to:
Posts (Atom)





