”శోధిని”

Saturday, 17 January 2015

నేడు యన్.టి.ఆర్ వర్థంతి !

నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగుజాతి మన్నలను పొంది, సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస భరిత పారిజాతం యన్.టి.ఆర్.   మరపురాని  మరువలేని మహానటుడు నందమూరి తారక రామారావు గారి 19వ వర్థంతి సందర్భంగా...

Thursday, 15 January 2015

చలి చంపేస్తోంది !


శీతాకాలం చివరి దశలోనూ చలి జనాన్ని బెంబేలెత్తిస్తోంది.  ఉదయం, సాయంత్రం వేళల్లోఇంటి నుండి బయటకు రావాలంటేనే  జంకుతున్నారు.   సంక్రాంతి వెళ్లిపోతున్నా మునుపెన్నడూ లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలను  చలి వణికిస్తోంది.  ఈ చలి పులి వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపించడంతో వృద్దులు, పిల్లలు సతమతమవుతున్నారు.  చలికి  ఫ్లూ వైరస్ తోడవడంతో అనేక రకాల శ్వాశకోశ వ్యాధులు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి.కొత్తగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదం కావడంతో ప్రజలు హడలి పోతున్నారు.  ఈ మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి.     


Wednesday, 14 January 2015

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు !

మన సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ...  ప్రకృతికి, మానవునికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని సూచిస్తూ ... తెలుగుదనం ఉట్టిపడే మకర సంక్రాంతికి స్వాగతం !  ఆప్యాయతలు, అనురాగాలు , బంధాలు, అనుబంధాల సమ్మేళన  సిరుల స్రవంతి సంక్రాంతికి సుస్వాగతం !!

Tuesday, 13 January 2015

భోగి పండుగ శుభాకాంక్షలు !


మంచు  కురిసే శీతాకాలం ...
ఉషోదయపు వెలుగులో...
తెలుగువారి వాకిట్లో ...
తళుక్కుమంటున్న 
భోగిమంటల సందడి 
భోగభాగ్యాల సవ్వడి !

మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు !

Monday, 12 January 2015

"సంక్రాంతి సంబరాలు"



'అంబ పలుకు జగదాంబ పలుకు' అంటూ కీర్తించే
బుడబుక్కల వాళ్ళ డమరుక ద్వని ...
'హరిలో రంగ హరీ ' అంటూ దీవించే
హరిదాసుల విష్ణునామ సంకీర్తనలు ...
జంగ దేవరుల ఇత్తడి ఘంటా ద్వనులు ...
పితృల ఋణం తీర్చే పితృతర్పణాలు ...
బోగిమంటలు, కోడి పందాలు ...
పిట్టల దొరలు, చెంచు నాయకులు ...
గంగెరెద్దుల విన్యాసాలు, గాలిపటాలు ...
వాకిట ముంగిట్లో విరబూసిన రంగవల్లులు...
గౌరీదేవి ప్రతిరూపాలయిన గొబ్బేమ్మలు ...
బొమ్మల కొలువులతో విరిసే చిన్నారుల బోసినవ్వులు ...
ఇంటింటా సంక్రాంతి ...వాడవాడకు క్రాంతి
ఊరంతా సంక్రాంతి సంబరాలు, సరదాలు...
మన సంస్కృతిని భావితరాలవారికి అందించే
ముచ్చటగా మూడురోజుల పండుగ
జరుపుకోకపోతే జీవితమే దండగ !