Monday, 10 November 2014
Monday, 3 November 2014
Sunday, 2 November 2014
Saturday, 1 November 2014
జంతు కళేబాలతో వంట నూనెలు !
జంతువుల వ్యర్థాలు, కళేబాలతో వంట నూనెలు తయారు చేయడం వినడానికే అసహ్యం వేస్తోంది కదూ! ఇది నిజం. డబ్బు కోసం అడ్డదారులు తొక్కే కొందరు, జంతువుల ఎముకలను భారీ బాండీలలో వేసి బాగా మరగబెట్టి నూనె, తీస్తున్నారట. ఆ నూనెను డబ్బాలలో నింపి రాత్రివేళలో మంచి నూనె తయారుచేసే ఇతర కంపెనీలకు సరఫరా చేస్తున్నారట. జంతువుల నుంచి తీసిన ఆ నూనె తక్కువ ధరకే లభించడంతో కొందరు హోటల్ యజమానులు బిర్యానీలో, రోడ్డు పక్క బజ్జీలు చేసే వాళ్ళు ఉపయోగిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ ఎముకలతో 'టీ' పొడిని కూడా తయారు చేసి అసలు టీ పొడిలో కలుపుతున్నారట. టీ నుంచి కానీ, డాల్డా నుంచి కానీ, నూనె లోంచి కానీ దుర్వాసన వస్తే అది కచ్చితంగా నకిలి నూనె అని గ్రహించాలి. ఈ నూనె, డాల్డా, టీ పొడి వాడిన ఆహారం తింటే అనేక రోగాల బారిన పడటం ఖాయం. అందుకే నూనె వాడకందారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
Wednesday, 29 October 2014
Monday, 27 October 2014
ప్రకృతిని కాపాడుకుందాం !
ప్రకృతిని కాపాడుకుందాం !
కొందరు ఆధునిక అవసరాల పేరుతో
కొండల్ని కొట్టేస్తూ, భూమిని తవ్వేస్తూ
ఇష్టం వచ్చినట్లు ప్రకృతిని పిండేస్తున్నారు
మరికొందరు ధన సంపాదనకోసం
నదులను తవ్వేస్తూ..అడవులను అంతం చేస్తూ
అత్యంత దయనీయంగా, క్రూరంగా
పెనువిద్వంసం సృష్టిస్తున్నారు
ఫలితంగా తుఫానులు, భూకంపాలు!
మన కళ్ళను మనేమే పొడుచుకుంటున్నాం
మన గోతుల్ని మనమే తవ్వుకుంటున్నాం
ప్రకృతి అందానికి ప్రతీకగా ఉండే ప్రాంతాలు
రెక్కలు తెగిన పక్షుల్ల విలవిలాడుతున్నాయి
పుడమితల్లి ఆవేదనను అర్థంచేసుకుందాం
మన ప్రకృతిని మనం కాపాడుకుందాం !
Saturday, 25 October 2014
Subscribe to:
Posts (Atom)

