Sunday, 5 January 2014
Saturday, 4 January 2014
అపర కీచకులు

విద్యాలయాలు దేవాలయాలు .. ఉపాధ్యాయులు ప్రత్యేక దైవాలు. కాని కొందరు నీతి బోధకులుగా, సమాజ సృష్టలుగా తమ బాధ్యతలను గాలికి వదిలేస్తున్నారు. విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే కీచాకులుగా మారిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడుతూ ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. ఇలాంటి వారి వద్ద విద్య నేర్చుకున్న వారిలో మానవ విలువలు నాశనమవుతున్నాయి. వ్యక్తులకు నైతిక విలువలు లోపించడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని పెద్దపూర మండలం ఓ తండాలో పసిమొగ్గలపై పైశాచానికి తెగబడ్డ నీచుడి ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన రాష్ట్ర ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. వెలుగు చూసేవి కొన్ని కేసులు మాత్రమే , వెలుగు చూడని సంఘటనలు కోకొల్లలు. కొందరి మగ మృగాల ప్రవర్తనకు మహిళలు చిగురుటాకుల్లా వణికి పోతున్నారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయనాయకులు ' ఖండిస్తున్నాం' అని అంటారు తప్ప, మహిళల రక్షణ కోసం చొరవ చూపడం లేదనేది జగమెరిగిన సత్యం. ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా.. పశుప్రవృత్తికి మాత్రం కళ్ళెం వేయలేక పోతున్నాయి. మహిళలు, చిన్నారులు ఆకృత్యాలకు బలవుతూనే ఉన్నారు. ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం పోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మూలాలు వెతికి సమూల ప్రక్షాళన చేయాలి. అందుకు యువత ముందుకు రావాలి. ఒక్క యువతతోనే ఇది సాధ్యమవుతుంది.
Friday, 3 January 2014
Tuesday, 31 December 2013
సృష్టి రహస్యం!
'సరే... నీకు తోడు కావాలి కదా! అలాగే ఇస్తాను' అని చెప్పి, సృష్టిలోని అద్భుతాలన్నీ మేళవించి 'స్త్రీ'కి ప్రాణం పోశాడట.
వారం రోజులు గడిచాక బ్రహ్మ దగ్గరకి పరుగెత్తుకొచ్చిన మగవాడు "స్వామి...! మీరు తోడుగా ఇచ్చిన జీవి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది.... విరామం లేకుండా మాట్లాడుతోంది. ప్రతిదానికి విస్సుకుంటోంది... నాకు ఏకాంతం లేకుండా చేస్తోంది... నేనామెతో కలిసి బతకలేను. ఈ జీవిని వెనక్కి తీసుకో" ఆన్నాడట.
చురునవ్వుతో ఆ యువతిని వెనక్కి తీసుకున్నాడట బ్రహ్మ.
రెండు రోజులు గడవక ముందే మళ్ళీ పరుగెత్తుకొచ్చిన పురుషుడు "దేవా...! ఆ జీవి నాకు దూరం అయినప్పటి నుంచి జీవితంలో ఉత్సాహం పోయింది. సంతోషం కరువయింది. నాతో ఆడి , పాడి, తన ఓరచూపులతో నన్ను ఆకట్టుకునేది... తక్షణమే ఆమె నాకు కావాలి... ఆమె లేకుండా జీవించలేను" వేడుకున్నాడట.
"చూడు నాయన ఇప్పటి కైన తెలిసిందా... 'స్త్రీ ' అంటే ఏమిటో.... స్త్రీలు లేని చోట శోభ కొరవడుతుంది. వారు లేకపోతే ప్రేమతత్వం వికసించదు. నిండుదనం లోపిస్తుంది ... అందం ఉండదు... ఆనందం ఉండదు" అని చెప్పి
బ్రహ్మ అదృశ్యమయ్యాడట.
స్త్రీ లేకుండా మగవాడు బ్రతకలేడని తెలుసుకున్నాడు పురుష పుంగవుడు.
Monday, 30 December 2013
అయోమయం!
కొన్ని ప్రశ్నలు అడిగాక, "ఇంతకు ముందు ఎక్కడయినా చేసిన అనుభవం ఉందా?" అడిగాడు ఇంటర్వ్యు అధికారి అయోమయం.
"బోలెడు అనుభవం వుంది సార్!"
"అయతే ఎక్కడక్కడ పని చేసావో వివరంగా చెప్పు "
"ఎలిమెంటరీ స్కూల్లో అయిదేళ్ళు... హైస్కూల్లో అయిదేళ్ళు ... జూనియర్ కాలేజీలో రెండేళ్ళు ... ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగేళ్ళు... మొత్తం పదహారేళ్ళు సార్"
"అదికాదయ్యా పని చేసిన అనుభవం"
"ఇప్పుడు మీరు ఉద్యోగం ఇస్తే అనుభవం దానంతట అదే వస్తుంది సార్!"
తను చెప్పేదాంట్లో నిజం వుందని గ్రహించి తరుణ్ ని ఎంపిక చేశాడు అయోమయం.
Subscribe to:
Posts (Atom)






