Wednesday, 9 October 2013
Tuesday, 8 October 2013
కలిసి వుందాం!
ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా
సృష్టిలోని ప్రతి వస్తువూ
ఎదోక రూపంలో మనకు
సౌఖ్యాన్ని, ఆనందాన్ని
అందిస్తున్నాయి
ఆప్యాయతానురాగ బంధాలకు
ప్రతిబింబాలయిన వీటికి
కులమత భేదాలు తెలియవు
ఈర్ష్యాద్వేషాలు ఉండవు
వీటిని ఆదర్శంగా తీసుకుని
మనమంతా ...
నిష్కలమైన మనసుతో
సౌబ్రాత్యుత్వంతో...
కలిసి మెలిసి మెలుగుదాం
ఒకరికొకరం తోడుగా నిలబడదాం!
Monday, 7 October 2013
ఆలయ అధికారులు కాస్త ఆలోచించండి!
రాష్ట్రంలో ప్రముఖ పుణ్య స్థలాలను దర్శించుకోవడానికి ప్రతి రోజు వేలాది మంది భక్తులు వెళుతుంటారు. అయితే అక్కడ గర్భగుడిలో ప్రశాంతంగా ఒక్క క్షణం నిలబడి దేవుణ్ణి కనులారా చూసే భాగ్యం కలగడం లేదు. ముఖ్యంగా తిరుమలలొ పెద్ద పెద్ద వి ఇ పి లకే శ్రీ వేంకటేశ్వరుని దర్శన భాగ్యం కలుగుతుందనే అపోహ లేకపోలేదు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలో ఎన్నో సౌకర్యాలు కలుగజేస్తున్నారు. కాని, గర్భగుడిలోకి వచ్చేసరికి ఒక్క సారిగా యుద్ద వాతావరణం నెలకొంటోంది. దాంతో ప్రశాంతంగా స్వామిని చేసే అవకాశం భక్తులు కోల్పోతున్నారు. ఇంటి దగ్గర నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలతో బయలుదేరితే, అక్కడ దేవాలయ సిబ్బంది తీరు వల్ల భక్తులకు చేదు అనుభవం ఎదురవుతోంది. దయచేసి ఆలయ అధికారులు కాస్త ఆలోచించి ప్రత్యేక దర్శనాలను తగ్గించి, ఒక్క క్షణమైనా స్వామిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పిస్తే బాగుంటుంది.
Saturday, 28 September 2013
కలిసి జీవిద్దాం!
అపార్ట్మెంట్స్ లో అన్ని వర్గాలు నివసిస్తూ ఉంటారు కాబట్టి, అపార్ట్మెంట్ 'నాది, మనది' అనే భావన అందరిలో కలగాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈర్ష్యా, ద్వేషభావాలు వీడి సందర్భోచితంగా మాట్లాడు కోవాలి. స్వంతనిర్ణయాలు తీసుకోకుండా అందరితో కలిసి పోతుంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మనిషిని చెడకొట్టడంలో మనసు పాత్ర చాలా గొప్పది. అది మంచివాళ్ళ ను తిడుతుంది, చెడ్డ వాళ్ళను పోగుడుతుంది. మనసును అదుపులో పెట్టుకోకపోతే అడుగడుగునా కష్టాలను తెచ్చిపెడుతుంది. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారి హృదయానికి పువ్వులా తాకాలి. అంతేకాని బురదలా అంటుకోకూడదు. కలసి మెలసి ఒకచోట నివచించే వాళ్ళు సంభాషణలను కోపంతో కాకుండా నిదానంగా మొదలు పెడితే ఏ గొడవలు ఉండవు. ఎదుటివాళ్ళు కుడా అదేవిధంగా స్పందిస్తారు. ఎదుటివాళ్ళు మన మాటల్ని ఒప్పుకోవాలనే ఉద్దేశంతో గట్టిగా అరవడం, గంతులు వేయడం సంస్కారం అనిపించుకోదు. పక్కవాడు మనల్ని ఎలా గౌరవించాలని అనుకుంటామో, అదే విధంగా వాళ్ళను మనం గౌరవించాలి. సమస్యను మాత్రమే మాట్లాడుకోవాలి తప్ప, గతంలో జరిగిన విషయాలను ప్రస్తావించిడం వల్ల సమస్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. మెజారిటి సభ్యుల అభిప్రాయాలను గౌరవిస్తూ... తోటివారితో సోదరభావంతో మెలుగుతూ ... ఆప్యాయత, అనురాగాలనులను పంచుకోవడానికి ప్రయత్నిచాలి. చెడుకు దూరంగా, మంచికి దగ్గరగా ఉంటే, ఏ అపార్ట్మెంట్ అయినా ఒక 'బృందావనం'లా... 'ఆనంద నిలయం'లా వెలుగుతుంది.
'దేవుడమ్మ' చిత్రంలో S.P.బాలు గారు పాడిన పాట
ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
స్వామి (అమ్మా) ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా చేసేస్తావు
స్వామి (అమ్మా)ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
* * * * * *
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
స్వామి (అమ్మా) ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు
మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా చేసేస్తావు
స్వామి (అమ్మా)ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు
తమాషా చూస్తున్నావు
* * * * * *
Wednesday, 25 September 2013
మన ప్రజా ప్రతినిధులు!
కొందరు అధికారం కోసం
ప్రజలను పావులు చేస్తే,
మరికొందరు పదవుల కోసం
నమ్ముకున్న ప్రజలను
నయవంచన చేస్తున్నారు
అధికారం పొందాలంటే
తెలుగు జాతిని ముక్కలు చేయాలా?
తమ పదవుల కోసం
ప్రజల మధ్య చిచ్చు పెట్టాలా?
రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేసినా
ప్రజలకు వోరిగేది ఏమీలేదు
లాభం మాత్రం రాజకీయ నాయకులకే!
ఇలాంటి నాయకులకు
ఓటు అడిగే హక్కు లేదు
ప్రజల మధ్య తిరిగే అర్హత
అంతకన్నా లేదు.
ప్రజలను పావులు చేస్తే,
మరికొందరు పదవుల కోసం
నమ్ముకున్న ప్రజలను
నయవంచన చేస్తున్నారు
అధికారం పొందాలంటే
తెలుగు జాతిని ముక్కలు చేయాలా?
తమ పదవుల కోసం
ప్రజల మధ్య చిచ్చు పెట్టాలా?
రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేసినా
ప్రజలకు వోరిగేది ఏమీలేదు
లాభం మాత్రం రాజకీయ నాయకులకే!
ఇలాంటి నాయకులకు
ఓటు అడిగే హక్కు లేదు
ప్రజల మధ్య తిరిగే అర్హత
అంతకన్నా లేదు.
Tuesday, 24 September 2013
రాష్ట్ర సమస్యను పరిష్కరించండి!
రాష్ట్రంలోనెలకొన్న పరిణామాలు సామాన్య ప్రజల్నిఅనేక ఇబ్బందులకు గిరిచేస్తున్నాయి. గత 57 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పడకేసింది. ప్రజాప్రతినిధులేమో తమ పదవులను కాపాడుకుంటూ తమకేమీ పట్టనట్ట్ల్లు వ్యవహరిస్తున్నారు. సమస్య పరిష్కారం కనుక్కోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇప్పటికే నిత్యావసర ధరల తాకిడితో బాధపడుతున్న ప్రజలను తాజా పరిస్థితులు మరింత కుంగదీస్తున్నాయి. సీమాంద్ర లో స్కూళ్ళు నడవడం లేదు. బస్సులు తిరగక పోవడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా లేదు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టి కలసికట్టుగా రాష్ట్ర పరిష్కారానికి కృషి చేయండి. పార్టీల మధ్య ఐక్యత లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఇంతవరకు వచ్చిందని తెలుసుకోండి. రాజకీయ పార్టీ నాయకులందరూ ఒక చోటకు చేరి ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకుని రాష్ట్ర సమస్యను పరిష్కరించండి. సమస్యల సుడిగుండంలోంచి ప్రజలను బయటికి తీసుకురండి. లేకుంటే రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
Subscribe to:
Posts (Atom)


