”శోధిని”

Tuesday, 24 September 2013

పవిత్ర కోనేరు!

వికారాబాద్, అనంతసాగర్ లో వెలసిన శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రక్కన ఉన్న కోనేరు ఇది.

ఇక్కడ ధారగా ప్రవహిస్తున్న నీరు 365 రోజులు, 24 గంటలు ఏకధాటిగా రావడం విశేషంగా చెప్పుకుంటారు.

  వచ్చిన నీరు వచ్చినట్లు మరో మార్గం ద్వారా వెళ్లిపోవడంతో ఎలాంటి కలుషితం లేని స్వచ్చమైన నీటిని  

ఇందులో మనం చూస్తాం.






Sunday, 8 September 2013

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

భారతీయుల ఆరాధ్య దైవం 'వినాయకుడు'.  ఓంకార స్వరూపమే గణపతి స్వరూపం అంటారు.  నిందలను, విఘ్నాలను తొలగించి ముక్తిని ప్రసాదించే గణనాధుడిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఈ సంవత్సరం తొమ్మిదో తేది సోమవారం వినాయక చవితి. ఈ రోజున మధ్యాహ్నం 3.32గంటల వరకే చవితి ఉండటం వలన వినాయక ప్రతిమను ఈలోగా స్థాపన చేసి పూజ ముగించాలి.  ఉదయం 7.30 గంటల నుంచి 9.00 గంటల వరకు రాహుకాలం ఉండటం వలన ఈ సమయంలో వినాయక ప్రతిమను స్థాపన, పూజలు చేయరాదు. 

ఓ వినాయకా...
దుష్టశక్తులను అదిమిపట్టు
అరాచక శక్తులను తరిమికొట్టు 
దేశానికి రక్షణ కలిగించు 
మాలో చిరుదీపం వెలిగించు

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!


Tuesday, 3 September 2013

నేటి పిల్లలు!

కార్పోరేట్ చదువులకి అలవాటు పడిన పిల్లలు మాతృ భాషలో మాట్లాడలేక పోతున్నారు. ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పు లేదు, కాని మాతృ భాషను చిన్న చూపు చూడటం మంచిది కాదు. ఇవన్నీ నేటి బాలబాలికలకు నేర్పించాల్సిన భాద్యత ఇటు తల్లిదండ్రుల పైన, అటు ఉపాధ్యాయుల పైన ఉంది. పిల్లలకు చిన్నవయసులోనే దైవభక్తి, దేశభక్తి, పెద్దలను గౌరవించడం నేర్పించాలి. మన సంస్కృతి, సంప్రదాయాలు, బంధాలు, ఆప్యాయతల గురించి తెలియజేయాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పిల్లలకి అవసరమే కాని, మన సంస్కృతిని, నైతిక విలువలను విస్మరించడం మంచిది కాదు.



కూరగాయల అలంకరణలో శ్రీ ఆంజనేయస్వామి!