బొప్పాయిలో ఔషద గుణాలు, పోషక విలువలు అనేకం ఉన్నాయి. ఈ పండును తింటుంటే ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదని పెద్దలు చెబుతారు. అయితే బొప్పాయిని మితంగా తినాలి. జీర్ణశక్తి పెరుగుతుంది, సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. నొప్పులు, వాపులు, చర్మ వ్యాధులకు అమోఘంగా పనిచేస్తుంది. బొప్పాయి పండును తీసుకోవడం వల్ల ఆయుష్షు, తేజస్సు, వర్చస్సు ఇనుమడిస్తాయి. అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
Wednesday, 19 June 2013
Tuesday, 18 June 2013
Monday, 17 June 2013
వినోదం అంటే ఇదేనా?

ఈటీవీ లో వచ్చే 'జబర్దస్త్ కామెడీ షో' హాట్ ... హాట్ యాంకర్స్ ని అందిస్తోంది. మొదట అనసూయతో ప్రారంభమైన 'జబర్దస్త్ కామెడీ షో'లో ఆమె హావభావాలు,ఆమె ధరించే దుస్తులు టీవీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దాంతో ఈ షో ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. అనసూయను చూసి మన యాంకర్స్ డీలా పడిపోయారు. ఇప్పుడు అనసూయ ఛానల్ మారడంతో 'జబర్దస్త్ కామెడీ షో' కి రేష్మీ అనే మెరుపు తీగ యాంకర్ గా దూసుకువచ్చింది. అనసూయను మరిపించేలా దుస్తులతో, తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ... అనసూయకు గట్టిపోటీ ఇస్తోంది. కొసమెరుపు ఏమిటంటే 'జబర్దస్త్ కామెడీ షో' చూస్తుంటే ఇది ఈటీవీ యేనా అనే అనుమానం రాక మానదు. ఎందుకంటే ఈటీవీ లో ఇంతకు ముందు ఇలాంటి అభ్యంతకర, అశ్లీలకర సన్నివేశాల కార్యక్రమాలు రాలేదు. 'జబర్దస్త్ కామెడీ షో'లో కామెడీ శృతిమించి పోయింది. కామెడీ అంటే హాయిగా కుటుంబసమేతంగా నవ్వుకోవాలి. కుళ్లు జోకులు, డబుల్ మీనింగ్ సంభాషణలతో రోత పుట్టిస్తున్నారు. వినోదం అంటే ఇదేనా?
Saturday, 15 June 2013
ఓ నాన్నా...నీ మనసే వెన్న!
ఓ నాన్నా ఓ నాన్నా
ఓ నాన్న! నీ మనసే వెన్న
అమృతం కన్న అది ఎంతో మిన్న
ఓ నాన్నా ఓ నాన్నా
ముళ్ళ బాటలో నీవు నడిచావు
పూలతోటలో మమ్ము నడిపావు
ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో
పరమాన్నం మాకు దాచి వుంచావు //ఓ నాన్న//
పుట్టింది అమ్మ కడుపులోనైనా
పలు పట్టింది నీ చేతిలోన
ఊగింది ఉయ్యాలలోనైనా
నేను దాగింది నీ చల్లని ఒడిలోన
చల్లని ఒడిలోన //ఓ నాన్న//
ఉన్న నాడు ఏమి దాచుకున్నావు
లేనినాడు చేయి సాచనన్నావు
నీ రాచగుణమే మా మూలధనము
నీవే మాపాలి దైవము //ఓ నాన్న//
Friday, 14 June 2013
Wednesday, 12 June 2013
Monday, 10 June 2013
మిల్క్ బ్యూటీ!
తెలుగు చలనచిత్రరంగంలో రచ్చరచ్చ చేస్తూ... తన తడాఖా చూపిస్తోంది మిల్క్ బ్యూటీ తమన్నా. తన అందాలను యధేశ్చగా ఆరబోస్తూ బికినీ షోకు సై అంటోంది ఈ ముద్దుగుమ్మ. అదిరేటి డ్రస్ లతో కుర్రకారు గుండెల్లో గుబురు పుట్టిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలందరి తోనూ నటించింది. ఇంత వరకు ఈ అమ్మడుతో నటించని హీరోలు ఆమేతో సినిమా చేయడానికి తహతహలాడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ను ఒక ఊపు ఉపేస్తున్న తమన్నా దీపం ఉండగానే ఇళ్ళు చక్కబెట్టుకుంటోంది. సమాజంతో పనిలేదు డబ్బే ప్రదానమని ముందుకు వెళ్తోంది.
Subscribe to:
Posts (Atom)





