Tuesday, 30 April 2013
హైటెక్ మానవుడు!
నేడు మానవ సంబంధాలు
ఆర్ధిక సంబంధాలుగా
మారి పోతున్నాయి
ఆస్తిని పెంచుకుంటూ
పరుల గురించి
ఆలోచించడం మానేస్తున్నారు
ఇంటి వైశ్యాల్యం పెంచుకొంటూ...
హృదయ వైశ్యాల్యం
తగ్గించుకుంటున్నారు
కానరాదు ఎక్కడా మానవత్వం
అణువణువునా క్రూరత్వం
భోగభాగ్యాలు శాశ్వతం కాదని
సమాజంతో సత్ సంబంధాలు
ఇరుగు పొరుగు వారితో
కలిసి ఉండటం మఖ్యమని
ఈ హైటెక్ మానవుడు
తెలుసుకునేదేప్పుడో!
ఆర్ధిక సంబంధాలుగా
మారి పోతున్నాయి
ఆస్తిని పెంచుకుంటూ
పరుల గురించి
ఆలోచించడం మానేస్తున్నారు
ఇంటి వైశ్యాల్యం పెంచుకొంటూ...
హృదయ వైశ్యాల్యం
తగ్గించుకుంటున్నారు
కానరాదు ఎక్కడా మానవత్వం
అణువణువునా క్రూరత్వం
భోగభాగ్యాలు శాశ్వతం కాదని
సమాజంతో సత్ సంబంధాలు
ఇరుగు పొరుగు వారితో
కలిసి ఉండటం మఖ్యమని
ఈ హైటెక్ మానవుడు
తెలుసుకునేదేప్పుడో!
Friday, 26 April 2013
Monday, 22 April 2013
నీటి కష్టాలు!
రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో త్రాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. లక్షలాది మంది గుక్కెడు మంచి నీళ్ళ కోసం అల్లాడుతున్నారు. దానికి తోడూ విద్యుత్ కోతలు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. రాయలసీమ జిల్లాలలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ జిల్లాలలో భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయాయి. ఈ పరిస్థితి కావడానికి కారకులు మన పాలకులే. ఓట్ల కోసం అన్నీ ఉచితాలు ఇస్తామని వాగ్ధానాలు చేసే రాజకీయ నేతలే. ప్రజలు త్రాగడానికి మంచి నీళ్ళు ఇవ్వలేని పాలకులు ఎన్నికలు రాగానే అన్నీ ఉచితం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారు. నీటి కోసం ప్రజలు పడే పాట్లు చూసి కుడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నీటిని నింపాల్సిన చెరువులు కజ్జాకు గురవుతుంటే చోద్యం చూస్తున్నారు. ఇష్ట మొచ్చినట్లు బోర్లు వేసి నీటి వ్యాపారం చేస్తుంటే పట్టించుకునే నాధుడే లేడు. ఫలితంగా నేడు భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఎప్పటి కైన పాలకులు, రాజకీయ నాయకులు మేల్కొని తక్షణమే నీటి సమస్య పైన దృష్టి పెట్టాలి.
Sunday, 21 April 2013
పాపం పసిపాప
లోకం పోకడ తెలియని ముక్కుపచ్చలారని ఓ ఐదేళ్ళ పసిపాప పై ఓ నీచుడు పాశవికంగా అత్యాచారానికి పాల్పడి పాప బాల్యాన్ని చిదిమేయడం దారుణం. ఈ నరరూప రాక్షసుడు అత్యంత హేయంగా, రాయడానికి వీల్లేనంతగా మగ మృగ శాడిజాన్ని చూపించాడు. కామం తలకెక్కన కామందులు పసిపాపలను సైతం వదలక పోవడం మనుషుల్లో పెరిగిన పైశాచికత్వానికి పరాకాష్ట. ప్రభుత్వం చట్టాలు రూపొందించి చేతులు దులుపుకుంటుంది. పోలీసులు సరిగా స్పందించక పోవడంతో ప్రతిరోజూ ఇలాంటి అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిల్లో కొన్ని మాత్రమే వెలుగు చూస్తున్నాయి. వెలుగులోకి రానివి కోకొల్లలు. ఎంత జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్లుగా ఉంటున్నారు. ప్రజలు ఆందోళనలు చేస్తేనే నిందితులను పట్టుకుంటున్నారు. మానవ మృగాల్లో మార్పు రావాలంటే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే మృగాలను చట్టాలు, కోర్ట్ లంటూ తిప్పుతూ సమయాన్ని వృధా చేయకుండా ఒకేసారి ఉరితీయాలి.
అత్యాచారానికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారి త్వరగా కోలుకోవాలని భగవంతుడుని ప్రార్థిస్తాం.
Thursday, 18 April 2013
Wednesday, 17 April 2013
మల్లెపూల మహత్యం!
!
వేసవిలో ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా, సాయంకాలం వేళ మల్లెలను చూడగానే రోజంతా శరీరకష్టంతో అలసిపోయినవారి మనసంతా ఆహ్లాదం నిండుతుంది. మధురానుభూతి పొందుతారు. పరిమళానికి మారుపేరయిన పరిమళభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే! అంతేకాదు చల్లదనానికి, కమ్మదనానికి, గుభాలింపులకు మరు పేరైన మల్లెపూలు.... మహిళల సిగలో సహజ ఆభరణాలు. మండుటెండలో
మల్లెల సౌరభం జీవితాలనే మార్చేస్తుంది. ఇది మల్లెపూల మహత్యం.
Subscribe to:
Posts (Atom)





