Monday, 25 February 2013
Saturday, 23 February 2013
నిఘా వైఫల్యం
నెత్తుటి దాహంతో
ఉగ్రవాదం...
భయం గుప్పిట్లో
ప్రజల ప్రాణం...
ప్రాణాలు తోడేస్తున్న
నిఘా వైఫల్యం!
ఉగ్రవాదం...
భయం గుప్పిట్లో
ప్రజల ప్రాణం...
ప్రాణాలు తోడేస్తున్న
నిఘా వైఫల్యం!
ఐకమత్యం!
కాకుల్ని చూస్తే
తెలుస్తుంది
ఐకమత్యం
అంటే ఏమిటో...!
చీమల్ని చూస్తే
తెలుస్తుంది
సమైఖ్యత
అంటే ఏమిటో...!!
Wednesday, 20 February 2013
నేటి పరిస్థితి!
ప్రశ్నించడం...
మరచిపోయాం...
నిలదీయడం...
మానేశాం...
ప్రతిదానికి...
తలవంచడం...
నేర్చుకున్నాం...
అందుకే నాయకులు
నిత్యం మోసం
చేస్తూనే ఉన్నారు
ఇదీ నేటి పరిస్థితి!
Sunday, 17 February 2013
వికసించిన పుస్పానివి నువ్వు ...
విరజిమ్మే పరిమళాన్ని నేను!
విరిసే అనురాగం నువ్వు...
కురిసే మమకారాన్ని నేను!
మురిపించే రాగానివి నువ్వు...
మైమరపించే భావాన్ని నేను!
ప్రేమను పంచే ప్రాణానివి నువ్వు...
అభిమానాన్ని పంచే అపురుపాన్ని నేను!
అనురాగాల సన్నిధి నువ్వు...
ఆప్యాయతల పెన్నిధి నేను !
నీ ప్రేమ కోరుతుంది త్యాగాన్ని...
నా ప్రేమ ఆశించదు ఏ ప్రతిఫలాన్ని!
Friday, 15 February 2013
హాస్యం-అపహాస్యం
'నబూతే నభవిస్యత్' ఓ తెలుగు సినిమాలో హాస్య నటి వ్యంగ్యంగా చెప్పిన డైలాగ్ ఇది. ఈ బూతు డైలాగ్ ను థియేటర్స్ లో విని ప్రేక్షకులు పడి పడి నవ్వేసారు. అప్పటి నుంచి తెలుగు సినిమాలలో నీతి కంటే బూతుకే పెద్ద పట వేయడం మొదలయింది. హాస్యమంటే బూతు డైలాగ్ లేనని మన సినీపెద్దల నమ్మకం. హాస్య నటీనటులు వెగటు పదాలను పలకడానికే కేరాఫ్ గా మారారంటే అతిశయోక్తి కాదు. అదే హస్యమని భావించడం ప్రేక్షకుల
దౌర్భాగ్యం. అంతే కాకుండా హిందూ సమాజం పైన. హిందూ ఆచార సంప్రదాయాల పైన వ్యంగ్యాస్త్రాలు, పాటలు, మాటలు నానాటికి శృతిమించి పోతున్నాయి.
హాస్యమంటే వెకిలి చేష్టలు, రెండర్థాల మాటలు, అవహేళన చేయడం కాదని, ఎవరి మనసు నొప్పించక అన్ని వయసుల వారినీ, అన్ని వర్గాల వారిని కదుపుబ్బ నవ్వించేలా ఉండాలని సినీ దర్శక,నిర్మాతలు తెలుసుకుని హాస్యాన్ని అపహాస్యం కాకుండా చూడాలి.
Tuesday, 12 February 2013
ప్రేమను ప్రేమించు...ప్రేమను బ్రతికించు!
Subscribe to:
Posts (Atom)

