”శోధిని”

Saturday, 9 June 2012

చెత్త సినిమాలను తీయకండి!



 సగటు ప్రేక్షకుడు సినిమా నుంచి వినోదాన్ని ఆశించి థియేటర్ కు వస్తాడు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం వారికి సినిమానే ప్రధాన వినోదం.  కానీ, నేడు సకుటుంబ  సమేతంగా వెళ్లి చూడతగ్గ సినిమాలు కోశానా కనబడటం లేదు. వినోదం పేరిట  జుగుస్సాకరంగా వుండే అశ్లీల పదాలను యదేచ్చగా వాడుతున్నారు. కుటుంబ సభ్యులతో ఇలాంటి సినిమాకి వెళితే తల దించు కోవాల్సి వస్తోంది.  అడ్డమైన అశ్లీల పదాలను సెన్సారు వాళ్ళు ఎలా అనుమతిస్తున్నారో అర్థం కావడం లేదు.  అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే కథ, సున్నితమైన హాస్యం, వినసొంపు సంగీతం, శ్రావ్యమైన సంభాషణలతో పాటు వినోదాన్ని అందిస్తూ, మంచి సందేశాన్ని ఇవ్వడమే సినిమా ప్రధాన లక్ష్యం.  కానీ, ఇప్పుడొస్తున్న చిత్రాలలో ఇవేమీ కనిపించడం లేదు.  కేవలం హీరోల అభిమానుల  కోసమే సినిమాలు తీస్తున్నట్టు అశ్లీల సన్నివేశాలు, బూతు డైలాగులు, రక్తపు మడుగులను తెర నిండా నింపుతున్నారు.  కోట్ల రూపాయలు వసూలు చేసిందని సొంత డబ్బా కొట్టుకొనే చిత్రాలన్నీనా దృష్టిలో  చెత్త సినిమాలే. ఇలాంటి సినిమాలు సమాజానికిఉపయోగపడేవి కావు.  మన తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను, తెలుగు భాషను  కనుమరుగు చేస్తున్న చిత్రాలు. హీరోలు డబ్బుకు ఆశపడకుండా మంచి చిత్రాలలో నటించడానికి పూనుకోవాలి.  అలాగే దర్శక నిర్మాతలు కేవలం డబ్బునే కాకుండా సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు నిర్మిస్తే, పదికాలాలు పాటు గుర్తుండిపోతారు.


Monday, 4 June 2012

పర్యావరణాన్ని కాపాడుదాం ... ప్రాణకోటిని రక్షిద్దాం!



నేడు టెక్నాలజీ పేరుతో విలాసవంతమైన  జీవితం గడపడానికి అలవాటుపడి, ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నాం.  పరిశ్రమలు వదిలే వ్యర్ధ పదార్థాల వల్ల జలకాలుస్యం, వాహనాల వదిలే పొగ  వల్ల వాయుకాలుస్యం పెరిగిపోతోంది.  ప్లాస్టిక్ పర్యావరణానికి ముప్పు అని తెలిసినా విచ్చలవిడిగా ప్లాస్టిక్ వస్తువులను వాడుతున్నారు. దాంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు భూమి పైపొరల్లో పేరుకుపోయి అనేక సమస్యలకు కారణమవుతున్నాయి.  అధిక దిగుబడులకోసం పంటపొలాలపై రసాయనక ఎరువులు,పురుగు మందులు వాడుతున్నారు.  కలప కోసం అడవుల్ని నరికి ముగజీవులకు నీడ లేకుండా చేస్తున్నారు. పచ్చదనం మీదే ప్రపంచ మనుగడ ఆధారపడివుందన్న విషయం మరువకూడదు. మనిషికొక చెట్టు నాటి, బిడ్డలా పెంచితే దేశంలో కోట్ల వృక్షాలు పుట్టుకొస్తాయి.  పచ్చని చెట్లు కాలనీల నిండా  నాటితే భూమాత చల్లగా వుంటుంది.  దాంతో వర్షాలు పుష్కలంగా కురుస్తాయి.  సర్వ జీవకోటికి ప్రాణాధారమైన చెట్లను నరకడం మాని మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి.  పర్యావరణానికి ముప్పువాటిల్లితే అకాల వర్షాలు, పండిన పంటలను మింగేస్తాయి.  మండే ఎండలు మనల్ని మాడ్చేస్తాయి.  కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొచ్చి ప్రజల ప్రాణాలు తీస్తాయి. పర్యావరణాన్ని  పరిరక్షించాలంటే, కొండలను కొండలుగా ఉంచాలి.  నదులను నదులుగా పారనివ్వాలి.  చెట్లను చెట్లగానే బ్రతకనివ్వాలి.  స్వచ్చమైన నీరు, స్వచ్చమైన గాలి లభించిననాడే కాలుష్య రహిత సమాజం ఏర్పడుతుంది.  తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుంది.

నాయకుడు



 వాడికి ఓటు వేసిన ప్రతిసారీ...
మనమే ఓడిపోతుంటాం
వాడేమో పైకి వెళ్లి 
మనకు చుక్కలు చూపిస్తాడు 
ఓటు కోసం మనల్ని అడుక్కుంటాడు 
వాడు మంత్రి అయ్యాక 
మనం అడుక్కోవాలి వాడ్ని
ఎన్నకలోస్తే కందిరీగలా...
మనచుట్టూ తిరుగుతాడు 
ఎన్నికలయ్యాక తునీగలా...
వాడి చుట్టూ మనం తిరగాలి 
ఎన్నికల ముందు కురిపిస్తాడు వరాలు 
తర్వాత మనకు పట్టిస్తాడు చెమటలు 
ప్రజా సమస్యల్ని వాగ్ధానాలుగా మార్చి 
పదవికోసం ఎటయినా దూకుతాడు 
ఊసరివెల్లిలా రంగు దుస్తులు మార్చుతూ... 
అవకాశం కోసం గోడమీది పిల్లిలా ...
నిత్యం ఎదురు చూస్తుంటాడు
పెద్ద ఆఫర్ రాగానే గోడ దూకేస్తాడు 
ఇలాంటి వాళ్ళని కంట కనిపెట్టాలి 
ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలి.

Saturday, 2 June 2012

క్యా డైలాగ్ హై ...!




చిరంజీవి           : ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో!, బాక్స్ బద్దలవుతుంది.

బాలకృష్ట          : కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా.  ఒక్కసారి అరిచానంటే సౌండ్  కే చస్తావ్!

మోహన్ బాబు   : నా రూటే సపరేటు,ఇద్దరు కలుస్తే  పుట్టాం... నలుగురు మోస్తే పోతాం.

పవన్ కళ్యాణ్     : నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది

జూనియర్ NTR : కరంటు కూడా నాలాగే సన్నగా వుంటుంది...టచ్ చేస్తే దానమ్మ షాకే!

మహేష్ బాబు    : ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండు

రామ్ చరణ్       : ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వందమందిని ఒకేసారి పంపించు.

ఎస్వీ రంగారావు : సాహసం చేయరా డింభకా!

నూతన ప్రసాద్   : అసలే దేశం చాలా క్లిష్ట పరిస్థితులో వుంది.

రావు గోపాలరావు : ఊరికే తిని తొంగుంటే మనిషికీ గొడ్డుకి తేడా ఏముంది.  మనిషన్నాక     కూస్తంత కళా పోషణ వుండాలి.

Thursday, 31 May 2012

దాహం...దాహం...!




       రాష్ట్రంలోమండుతున్న ఎండలకు తోడు తాగడానికి మంచి నీరు దొరక్క ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు.  డబ్బున్నవారు నీటిని కొనుక్కొని తాగితే, పేదప్రజలు మాత్రం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు.  డిమాండుకు అనుగుణంగా ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయలేక పోతున్నారు.  సిబ్బంది, ట్యాంకర్ డ్రైవర్స్ కుమ్మకై నీటిని దారి మల్లిస్తూ, అవినీతికి పాల్పడుతుండటంతో ప్రజల గొంతులు తాడారిపోతున్నాయి.  పట్టణాలలోనే కాకుండా గ్రామాలలోనూ ఎదే పరిస్థితి. ప్రభుత్వం పైన నమ్మకం లేక చాలా మంది తినడానికి తిండి లేకపోయినా తాగేందుకు మినరల్ వాటర్ క్యాన్లను ఆశ్రయిస్తున్నారు.  కనీసం తాగేందుకు మంచినీటిని కూడా ఇవ్వలేని ధీన స్థితిలో ప్రభుత్వం ఉన్నదంటే పరిస్థితి ఎంత ధారుణంగా వుందో అర్థమవుతోంది.  ఒకప్రక్క నీటి వ్యాపారులు  యథేచ్ఛగా భూగర్భ జలాలను తోడేస్తుంటే భూగర్భం తడారిపోయింది.  మరోప్రక్క బోర్లు ఎండిపోయి చుక్క నీరు రావడంలేదు.  నాయకులందరూ ఉపఎన్నికల పైన దృష్టి పెట్టడంతో ప్రజల నీటి కష్టాలను తీర్చే వారు కరువయ్యారు.  ప్రభుత్వం వున్నా లేనట్టుగా కనిపిస్తోంది. ఇక వానదేవుడే  ప్రజలపైన కరుణ చూపాలి.