”శోధిని”

Wednesday, 19 October 2011

టీవీల్లో వాణిజ్య ప్రకటనలు

టీవీల్లో వస్తున్న కొన్ని వస్తువుల వాణిజ్య ప్రకటనలు అభ్యంతరకరంగా ఉంటున్నాయి.  కుటుంభ సభ్యులంతా 
కలసి టీవీ చూస్తున్నప్పుడు జుగుస్సాకరమైన దృశ్యాలను ప్రసారం చేయడాన్ని నిలువరించాల్సిందే!  
సభ్యసమాజం  తలదించుకునేలా ఉంటున్న ఇలాంటి వాటిని ప్రసారాలకు ఎలా అనుమతిస్తున్నారో అర్థం 
కావడం లేదు. ప్రకటనలు వస్తు నాణ్యతకు సంబందించినదిగా ఉండాలి.  వాటి సద్గుణాలను ప్రజలకు  తెలియజేసేవిధంగా మలచాలి .  అసభ్య దృశ్యాలు  ఉన్న ప్రకటనల్ని ప్రసారం చేయడం నైతిక విలువలకు తిలోదకాలివ్వడమే అవుతుంది.  టీవీల యాజమాన్యం ఇలాంటి అసభ్యకరమైన  వాణిజ్య ప్రకటనలను 
తమ ఛానల్లో ప్రసారం చేయకుండా చూడాలి.

Tuesday, 18 October 2011

మన భాష తెలుగు భాష

మా ఆఫీసులో పనిచేసే వారంతా తెలుగువారే. కాని, తెలుగు మాట్లాడితే తమ హొదాకు భంగమనుకుంటారు.      తెలుగు మాట్లాడేవారిని చూసి నవ్వుకుంటారు.  తెలుగు పదాలను హేళన చేస్తుంటారు.  పరభాషా వ్యామోహంలో     పడి మన తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు.  తెలుగు భాషలోని తియ్యదనం ఇలాంటివారికి ఎంత       చెప్పినా చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లు అవుతుంది.  కట్టు, బొట్టు తెలుగువారిదయినప్పుడు  తెలుగులో మాట్లాడటం అవమానంగా భావించడం ఎందుకు?  గొప్పలకుపోయి  మాతృభాషను కించపరచడం ఎందుకు?  ఇలాంటివారివల్ల తెలుగు సంస్కృతులు, ఆచారవ్యవహారాలు మాయమైపోతున్నాయి.  మధురమైన తెలుగు    భాషలోని పలుకులు తేనెలొలికే గులికలని, ప్రతి తెలుగుపదం వీనులవిందుగా, వినసొంపుగా ఉంటాయని మన తెలుగువాళ్ళు తెలుసుకొనే రోజు రావాలి.   

Wednesday, 12 October 2011

ప్రజల భాధలు

సకల జనుల సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనులు పూర్తిగా స్తంభించి పోయాయి.  నెల నుంచి విద్యాసంస్థలు తెరవకపోవడంతో విద్యార్థుల భవిషత్తుఫై తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమాజాన్నికలుషితం చేసే మద్యం షాపులు, సినిమాలను సమ్మెలో మినహాయించి విజ్ఞానాన్ని పంచే విద్యాసంస్థలను మూసివేయడం బాధాకరం. సమ్మె రోజురోజుకి ఉద్రుతరూపం దాల్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.పరిపాలనా వ్యవస్థ పూర్తిగా స్థమించి పోవడంతో అసలు ప్రభుత్వం అనేది వున్నదా అనే అనుమానం ప్రజలలో నెలకొంది. ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ఆటోడ్రైవర్లు విపరీతంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి అయినా ఉద్యమనేతలు స్పందించి విద్యార్థుల భవిషత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మె నుంచి విద్యాసంస్థలను మినహాయింపు ఇచ్చి  ఆర్టీసి బస్సులను నడిపించి ఆటోడ్రైవర్ల బారినుంచి ప్రజలను కాపాడాలని మనవి. 

Wednesday, 5 October 2011

బ్లాగు వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు

మంచి మాటలు

"నిజం చెప్పేవాడికి పనితనం ఎక్కువ 
అబద్దాలు చెప్పేవాడికి మాటలు ఎక్కువ"

* * * * * * * * * * * *

"కుడిచేత్తో నమస్కారం సంస్కారం 
ఎడమచేత్తో నమస్కారం తిరస్కారం"

* * * * * * * * * * * *

"పొదుపుగా వాడితే దొరుకుతుంది నీరు 
దుబారా చేస్తే మిగిలేది కన్నీరు"

* * * * * * * * * * * * 

"పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భవిత 
పర్యావరణ రక్షణ మన భాధ్యత"

* * * * * * * * * * * *